King Charles Coronation | రాజు పట్టాభిషేకానికి రూ.1000 కోట్లు ఖర్చు
King Charles III | బ్రిటన్ (Britain) తదుపరి రాజుగా కింగ్ చార్లెస్ ప్రమాణం (King Charles Coronation) చేయనున్నారు. రాజు పట్టాభిషేకానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్ పౌండ్లు ఖర్చుపెడుతున్నట్లు అంచనా.
King Charles III | బ్రిటన్ (Britain) తదుపరి రాజుగా కింగ్ చార్లెస్ ప్రమాణం (King Charles Coronation) చేయనున్నారు. ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 (Elizabeth II) గతేడాది సెప్టెంబర్లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ (Britain) తదుపరి రాజుగా ఛార్లెస్-3 (King Charles III ) బాధ్యతలు చేపట్టారు. అయితే, అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం (Coronation) మాత్రం మే 6న జరగనుంది. ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా వెళ్లాయి.
కాగా, రాజు పట్టాభిషేకానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్ పౌండ్లు ఖర్చుపెడుతున్నట్లు అంచనా. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.1020 కోట్లు అన్నమాట. అయితే, ఈ ఖర్చు మొత్తం బ్రిటన్ ప్రభుత్వమే ( British government) చెల్లించనుంది. బ్రిటీష్ రాజవంశీకులు వివాహాలను సొంత ఖర్చుతో చేసుకుంటారు. పట్టాభిషేకానికి అయ్యే ఖర్చు మాత్రం ప్రభుత్వమే భరిస్తుందట. ఈ పట్టాభిషేకానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే కార్యక్రమ టీవీ ప్రసార హక్కుల నుంచి వచ్చే ఆదాయమే భారీగా ఉండనున్నట్లు సమాచారం. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే (Abbey Church of Westminister)లో జరిగే ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని 3.7కోట్ల మంది వీక్షిస్తారని అంచనా. ఈ కార్యక్రమం కోసం 700 ఏండ్ల చారిత్రక నేపథ్యం కలిగిన ఓ కుర్చీని కూడా సిద్ధం చేస్తున్నారు.
కాగా, 1953లో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-11 పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నేరుగా 3 లక్షల మంది తిలకించారట. అప్పట్లోనే రాణి పట్టాభిషేకానికి 1.5 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టారట. ప్రస్తుత కరెన్సీ విలువతో పోలిస్తే అది సుమారు 50 మిలియన్ పౌండ్లు. అంటే సుమారుగా రూ.528.7 కోట్లన్నమాట.
Also Read..
Ukraine | ‘కాళీమాత’ ఫొటోతో వివాదాస్పద ట్వీట్.. క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్
Salman Khan | మహిళల శరీరాలు విలువైనవి.. డ్రెస్ కోడ్ కాంట్రవర్సీపై సల్మాన్ స్పందన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

