Salman Khan | మహిళల శరీరాలు విలువైనవి.. డ్రెస్ కోడ్ కాంట్రవర్సీపై సల్మాన్ స్పందన
Salman Khan | బాలీవుడ్ (Bollywood) కండల వీరుడు, హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ (Salman Khan).. మహిళల ‘డ్రెస్ కోడ్’ కాంట్రవర్సీ ( Dress Code Controversy) పై స్పందించారు. మహిళల శరీరాలు ఎంతో విలువైనవని.. వాటిని దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని వ్యాఖ్యానించారు.
Salman Khan | బాలీవుడ్ (Bollywood) కండల వీరుడు, హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ (Salman Khan).. మహిళల ‘డ్రెస్ కోడ్’ కాంట్రవర్సీ ( Dress Code Controversy) పై స్పందించారు. మహిళల శరీరాలు ఎంతో విలువైనవని.. వాటిని దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి ప్రసారమైన ‘ ఆప్ కీ అదాలత్’ ( Aap Ki Adalat) టీవీ కార్యక్రమం (Tv Show)లో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కిసీ కా బాయ్ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan)లో సల్మాన్‌తో కలిసి నటించిన బాలీవుడ్ నటి పాలక్ తివారీ (Palak Tiwari).. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సెట్ (Cinema sets) లో అమ్మాయిల డ్రెస్ కోడ్ విషయంలో సల్మాన్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. సల్మాన్‌ఖాన్‌కు ఒక రూల్ ఉంది. సెట్లో పనిచేసే ప్రతి మహిళ.. శరీరం కనిపించకుండా నిండుగా ఉండే దుస్తులు ధరించాలి. డీప్ నెక్ ఉండే డ్రెస్సులు అస్సలు వేసుకోకూడదు. మెడ నుంచి కింది వరకు శరీరం కప్పి ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సల్మాన్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
‘ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ను వ్యాఖ్యాత ‘నో లో నెక్లైన్’ (no low neckline) నిబంధనపై ప్రశ్నించారు. ‘మీ సినిమా సెట్లోని మహిళలకు దుస్తుల విషయంలో నియమం పెట్టిన మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటిస్తారు కదా. ఇది ద్వంద్వ ప్రమాణాల కిందికి రాదా?’ అంటూ ప్రశ్నించారు. దీనికి సల్మాన్ ‘ఇందులో ద్వంద్వ ప్రమాణాలు ఏమీ లేవు. మహిళల శరీరాలు చాలా విలువైనవని నా అభిప్రాయం. అందుకే వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే అంత మంచిది. ఇది కేవలం మహిళల గురించి మాత్రమే చెబుతున్న మాట కాదు. అబ్బాయిల గురించి కూడా. మన తల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెల్లు వంట మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్న మాట. ఇలాంటి దుస్తుల వల్ల మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నాను’ అంటూ వివరించారు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇదే కార్యక్రమంలో తనకు వస్తోన్న బెదిరింపులపై కూడా సల్మాన్ స్పందించారు. ‘అభద్రతతో జీవించే కంటే భద్రత మధ్య ఉండటం మంచిది. బెదిరింపులు కారణంగా నాకు భద్రత పెంచారు. దీనివల్ల నేనిప్పుడు గతంలో మాదిరిగా రోడ్లపై సైకిల్ నడపడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లడం కుదరదు. ట్రాఫిక్‌లోనూ నా చుట్టు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అది ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. భగవంతుడిపై భారం వేశా. ఇప్పుడు నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి. వాటిని చూసి భయపడుతున్నా. చాలా జాగ్రత్తగా ఉంటున్నా’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read..
Met Gala | మెట్ గాలా భళా.. రెడ్‌కార్పెట్‌పై ఆలియా, ఈషా, ప్రియాంక మెరుపులు
Vande Bharat Train | వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. పగిలిని కిటికీ అద్దం
Salman Khan: పిల్లలు కావాలని ఉంది.. కానీ: సల్మాన్ ఖాన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

