Salman Khan: పిల్లలు కావాలని ఉంది.. కానీ: సల్మాన్ ఖాన్
Salman Khan: పిల్లలంటే తనకు ఇష్టమని సల్మాన్ అన్నాడు. ఇంకా పెళ్లి కాని సల్మాన్.. తన మ్యారేజీ గురించి మాట్లాడుతూ.. ఇండియన్ చట్టాల ప్రకారం తాను పిల్లల్ని కనలేకపోవచ్చు అని తెలిపాడు. ఆప్ కీ అదాలత్ షోలో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ముంబై: బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజాగా ఆప్ కీ అదాలత్ షోలో పాల్గొన్నాడు. అయితే తనకు పిల్లలు అంటే ఇష్టమని, కానీ ప్రస్తుతం ఉన్న భారతీయ చట్టాల ప్రకారం తాను తండ్రిని కాలేకపోతున్నట్లు వెల్లడించాడు. తల్లితండ్రుల పెళ్లి కోరికను తీర్చుతావా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మ్యారేజీ గురించి తనకు ఇంకా క్లారిటీ లేదని, కానీ తండ్రి కావాలన్న కాంక్ష ఉన్నట్లు సల్మాన్ తెలిపాడు.
ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇటీవల సరోగసీ పద్ధతిలో కవలల్ని కన్న విషయం తెలిసిందే. దానికి గురించి సల్మాన్ ప్రస్తావిస్తూ. . అలాగే చేయాలని తాను కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు చట్టం మారిందని, ఆ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపాడు.
పిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ పిల్లలు వస్తే, వాళ్లతో పాటే తల్లి కూడా వస్తుందని సల్మాన్ ఆ ఇంటర్వ్యూలో జోకేశాడు. పిల్లలకు తల్లే ముఖ్యమని, కానీ ఇండ్లల్లో తల్లులు చాలా మంది ఉన్నారన్నారు. నాకు పుట్టే పిల్లల తల్లి.. నాకు భార్య అవుతుందని, రాబోయే నాలుగైదు ఏళ్లలో పిల్లల్ని కంటే, అప్పుడు రాబోయే 25 ఏళ్ల పాటు వారితో ఆడుకోవచ్చు అని సల్మాన్ తెలిపాడు.
ఇక ప్రేమ విషయంలో తాను దురదృష్టవంతుడినని సల్మాన్ నవ్వుతూ చెప్పాడు. సల్మాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని మరోసారి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పుడు అది దేవుడి చేతుల్లో ఉందన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

