Kim Yo Jong | అమెరికా మిలిటరీ గూఢచారి విమానం (Us Military Spy Plane) తమ దేశంలోని ప్రత్యేక ఆర్థిక జోన్ (Exclisive Economic Zone)లోకి ఎనిమిదిసార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సోదరి కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) ఆరోపించారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టినట్లు చెప్పారు. ఈ మేరకు అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు.
తమ గగనతలంలో అమెరికా నిఘా కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆ విమానాలను కూల్చివేయొచ్చని హెచ్చరించారు. ‘మా దేశంలోని ప్రత్యేక ఆర్థిక జోన్ పై నిఘా విమానాలను ఎగురవేయడాన్ని కొనసాగిస్తే ఉత్తర కొరియా నిర్ణయాత్మక చర్య తీసుకుంటుంది’ అని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.
Also Read..
Dhanush | మద్రాస్ హైకోర్టులో నటుడు ధనుష్, ఐశ్వర్యలకు ఊరట..
Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో ఆగని లేఆఫ్స్.. ఈ సారి భారీగా తొలగింపులు
Himachal Pradesh | హిమాచల్ లో వరుణుడి బీభత్సం.. 30 మంది మృతి.. రూ.3వేల కోట్ల మేర నష్టం..!