కూతురితో కలిసి మిస్సైల్ టెస్టును వీక్షించిన కిమ్
North Korea | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి మిస్సైల్ టెస్టును పరీక్షించారు. ఆ ఫోటోలను కిమ్ విడుదల చేశారు. అయితే కిమ్‌కు ఎంత మంది పిల్లలు అనే విషయం ఇప్పటికీ తెలియదు. కిమ్ తన కుమార్తెను బయటకు
North Korea | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి మిస్సైల్ టెస్టును వీక్షించారు. ఆ ఫోటోలను కిమ్ విడుదల చేశారు. అయితే కిమ్‌కు ఎంత మంది పిల్లలు అనే విషయం ఇప్పటికీ తెలియదు. కిమ్ తన కుమార్తెను బయటకు తీసుకురావడం ఇదే మొదటిసారి. కిమ్‌కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో జరిగిన ఓ వేడుకలో కిమ్ తన పిల్లలో కనిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఈ నెల 3న ఏకంగా ఖండాతర క్షిపణిని (ICBM) పరీక్షించిన ఉత్తర కొరియా… తాజాగా శుక్రవారం మరోసారి ఐసీబీఎంని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. ఉత్తర కొరియా అనుమాస్పద ఖండాంతర క్షిపణిని పరీక్షించిందని సియోల్ సైన్యం వెల్లడించింది. ఇది ప్యాంగాంగ్ రూపొందించిన దీర్ఘ శ్రేణి ఆయుధమని, అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలుగుతుందని చెప్పింది. దీనితో అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని పేర్కొంది. కాగా, ఈ ప్రయోగంతో ఉత్తర కొరియా ఈ ఏడాది ఎనిమిది ఐసీబీఎంలను పరీక్షించినట్లయింది.
ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షతో జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశానికి చెందిన హొక్సైడో రీజియన్‌లోని ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ (EEZ) సముద్ర జలాల్లో క్షిపణి పడిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చెప్పారు. ఉత్తర కొరియా చర్య ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

