ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ పుష్ప సినిమాలో సమంత చేసిన డ్యాన్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆ పాటకు టాంజానియాకు చెందిన కిలి పాల్ అనే కుర్రాడు డ్యాన్స్ వేసి అదరగొట్టాడు.
అసలు.. ఒక తెలుగు పాట ఖండాంతరాలు దాటి ఎక్కడో ఉన్న టాంజానియా దాకా వెళ్లిందంటే అదంతా సోషల్ మీడియా మహత్యమే. టాంజానియాకు చెందిన కిలి పాల్.. బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలు పాటలకు డ్యాన్సులు వేసి తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేస్తుంటాడు. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇండియాకు చెందిన సినిమాల పాటలకు సూపర్బ్ డ్యాన్స్‌లు వేస్తుండటంతో మనోడికి చాలామంది ఇండియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇటీవలే పుష్ప సినిమాలోని సామీ పాటకు కూడా కిలి పాల్ డ్యాన్స్ వేసి అదరగొట్టాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఊ అంటావా పాటకు డ్యాన్స్ వేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. అదరగొట్టావుపో అంటూ కామెంట్లు చేస్తున్నారు.