న్యూయార్క్, ఆగస్టు 4: అమెరికాలోని మిన్సెసొటా ప్రాంతానికి చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ మహిళల కోటా గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఎందుకంటే ఆమెకు అతి పొడవైన గోర్లు ఉన్నాయి. ఆమె గోర్లు ఏకంగా 1,306.58 సెంటీ మీటర్ల పొడవు పెరిగాయి. 1997లో చివరి సారిగా ఆమె తన గోర్లను కత్తిరించుకున్నది.
అప్పటి నుంచి ఇప్పటివరకు గోర్లను కత్తిరించుకోలేదు. నాలుగైదు ఏండ్లకోసారి మాత్రమే నెయిల్ పాలిష్ వేసుకుంటుందట. పైగ వేసుకోవాలంటే 15 నుంచి 20 సీసాలు అవసరం పడుతాయని ఆమె చెబుతున్నది.