గన్ మిస్ ఫైర్.. అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి
తుపాకీ మిస్ ఫైర్ కావడంతో.. అమెరికా వెళ్లిన ఖమ్మం విద్యార్థి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మృతిచెందాడు.
తుపాకీ మిస్ ఫైర్ కావడంతో.. అమెరికా వెళ్లిన ఖమ్మం విద్యార్థి సోమవారం మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి.. ఎంఎస్ చదివేందుకు సంవత్సరం క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడే అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ… యూనివర్శిటీ సమీపంలోని ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డ్ తన వద్ద ఉన్న తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో.. ఆ తుపాకీ మిస్ ఫైర్ అయ్యి అఖిల్‌సాయి తలలోకి నేరుగా బుల్లెట్ దూసుకెళ్లింది. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అతడిని వెంటనే దవాఖానకు తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పోందుతూ అఖిల్ మృతిచెందాడు. కాగా విద్యార్థి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో సొంత గ్రామం మధిరలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

