Kevin McCarthy: ఎట్టకేలకు గెలిచిన కెవిన్ మెకార్థి.. అమెరికా హౌజ్ స్పీకర్‌గా ఎన్నిక
Kevin McCarthy రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్థి ఎట్టకేలకు .. అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 15వ రౌండ్ ఓటింగ్ తర్వాత ఆయన స్పీకర్‌గా గెలిచారు. నిజానికి హౌజ్‌లో రిపబ్లికన్ల ఆధితప్యం ఉన్నా.. కొందరు రెబల్స్ వల్ల కెవిన్ తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది. స్పీకర్ ఎన్నిక కోసం నాలుగు రోజులుగా ఓటింగ్ జరుగుతోంది. కెవిన్‌కు మద్దతు ఇచ్చేందుకు రిపబ్లికన్ రెబల్స్ వెనుకాడారు. దీంతో స్పీకర్ ఎన్ని
వాషింగ్టన్: రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్థి ఎట్టకేలకు .. అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 15వ రౌండ్ ఓటింగ్ తర్వాత ఆయన స్పీకర్‌గా గెలిచారు. నిజానికి హౌజ్‌లో రిపబ్లికన్ల ఆధితప్యం ఉన్నా.. కొందరు రెబల్స్ వల్ల కెవిన్ తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది. స్పీకర్ ఎన్నిక కోసం నాలుగు రోజులుగా ఓటింగ్ జరుగుతోంది. కెవిన్‌కు మద్దతు ఇచ్చేందుకు రిపబ్లికన్ రెబల్స్ వెనుకాడారు. దీంతో స్పీకర్ ఎన్నికలో ప్రతిష్టంభన ఏర్పడింది. చిట్టచివరకు మెకార్థి 216 ఓట్లతో హౌజ్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
స్పీకర్ ఎన్నిక కోసం 428 మంది ఓటేశారు. దాంట్లో మెకార్థికి 216 ఓట్లు రాగా, డెమోక్రటిక్ అభ్యర్థి హకీమ్ జెఫ్రిజస్కు 212 ఓట్లు పోలయ్యాయి. కెవిన్‌కు మెజారిటీ వచ్చిందని, ఆయనే హౌజ్ స్పీకర్ అని క్లర్క్ చెర్లి జాన్సన్ ప్రకటించారు. మెకార్థి గెలవగానే రిపబ్లిక్లను హర్షధ్వానాలతో సభలో హోరెత్తించారు. యూఎస్ఏ, యూఎస్ఏ అంటూ రిపబ్లికన్లు అరిచారు. హౌజ్ ఎజెండా, లెజిస్లేటివ్ బిజినెస్ మొత్తం స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. ఇక కొత్తగా ఎన్నికైన సభ్యుల నియామకం కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. దీని వల్లే స్పీకర్ ఎన్నిక అంశం కీలకంగా మారింది.
దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలి తర్వాత హోదాలో స్పీకర్ నిలుస్తారు.హౌజ్ స్పీకర్‌గా ఎన్నికైన మెకార్థికి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంగ్రాట్స్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

