మానవమృగం కసబ్‌కు ఉరిశిక్ష ఖరారు.. చరిత్రలో ఈరోజు
దేశ ఆర్థిక రాజధాని ముంబైపై తుపాకులతో దాడి చేసి పెద్ద ఎత్తున మారణహోమానికి సూత్రధారి కసబ్‌కు ముంబై ప్రత్యేక కోర్టు 2010 లో సరిగ్గా ఇదే రోజున ఉరిశిక్ష ఖరారు చేసింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైపై తుపాకులతో దాడి చేసి పెద్ద ఎత్తున మారణహోమానికి సూత్రధారి కసబ్‌కు ముంబై ప్రత్యేక కోర్టు 2010 లో సరిగ్గా ఇదే రోజున ఉరిశిక్ష ఖరారు చేసింది. ముంబైలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో దాదాపు 160 మంది పౌరులు కన్నుమూశారు. మరో 300 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులపై జరిగిన ఆపరేషన్‌లో ముంబై పోలీసులు, ఎన్ఎస్జి, ఎస్‌పిజిలకు చెందిన 10 మందికి పైగా సైనికులు మరణించారు.
కరాచీ మీదుగా పడవలో భారత్‌లోకి ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26 మారణహోమం సృష్టించారు. లియోపోల్డ్ కేఫ్, శివాజీ ఛత్రపతి టెర్మినస్‌తో ఈ దాడి ప్రారంభమైంది. అనంతరం తాజ్ హోటల్, హోటల్ ఒబెరాయ్, నారిమన్ హౌస్ ప్రాంతంలో కూడా కాల్పులకు తెగబడి పలువుర్ని హతమార్చారు. మూడు రోజులపాటు భద్రతా దళాలు ఉగ్రవాదులతో పోరాడి చివరకు 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాదిని మాత్రమే ఛత్రపతి శివాజీ టెర్మినస్ ప్రాంతంలో సైన్యం సజీవంగా పట్టుకున్నాయి.
ఈ కేసు విచారణ 2009 జనవరి నెలలో ముంబై ప్రత్యేక కోర్టులో ప్రారంభమైంది. ఈ సమయంలో కసబ్‌ను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచారు. ఈ కేసులో ఉజ్జ్వాల్ నికమ్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. ఫిబ్రవరి 25 న 11 వేల పేజీల మొదటి చార్జిషీట్ దాఖలైంది. 2010 మార్చిలో కేసు విచారణ పూర్తయింది. 2010 మే 3న కోర్టు తీర్పును ప్రకటిస్తూ కసబ్ దోషిగా తేల్చింది. తిరిగి మే 6 న సమావేశమైన కోర్టు కసబ్‌కు మరణశిక్ష విధిస్తూ తుది తీర్పు వెల్లడించింది. 2011 లో బొంబాయి హైకోర్టు.. ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా కసబ్‌కు ఉపశమనం ఇవ్వకుండా మరణశిక్షను ఆమోదించింది. 2012 నవంబర్ 21 న ఉదయం 7.30 గంటలకు పుణెలోని ఎరవాడ జైలులో కసబ్‌ను ఉరితీశారు. కసబ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా పాకిస్తాన్ నిరాకరించడంతో ఇక్కడి జైలులోనే ఖననం చేశారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2007: ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నికోలస్ సర్కోజీ
2002: అంతరిక్ష ప్రయోగాల నిమిత్తం స్పెస్ ఎక్స్ సంస్థను ప్రారంభించిన ఎలోన్ మస్క్
1998 : యాపిల్ సంస్థ ఉత్పత్తి చేసిన తొలి ఐ మ్యాక్ ప్రారంభం
1985: రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌లో బెయిలీ బ్రిడ్జెస్ ఆవిష్కర్త సర్ డోనాల్డ్ బెయిలీ మరణం
1976: ఇటలీలో సంభవించిన భూకంపంలో 989 మంది దుర్మరణం
1953: బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ జననం
1889: పారిస్‌లో అధికారికంగా ప్రజల సందర్శనార్ధం ఈఫిల్ టవర్‌ను తెరిచిన అధికారులు
1861 : మోతీలాల్ నెహ్రూ జననం
1856: ఆస్ట్రియన్ మనస్తత్వవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ జననం
1529: ఘఘ్రా యుద్ధంలో బెంగాల్, బిహార్ పాలకులను ఓడించిన బాబర్
ఇవి కూడా చదవండి..
భారత ప్రయాణికులపై శ్రీలంక నిషేధం
కేరళలో 8 రోజులు సంపూర్ణ లాక్డౌన్
మంగళసూత్రం ధరించిన వరుడు.. మరి నెలసరి అవుతున్నాడా..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

