Kanye west VS Elon Musk | ట్విట్టర్ నుంచి కాన్యే వెస్ట్ తొలగింపు.. మస్క్ హాఫ్ చైనీస్ అన్న యే
Kanye west VS Elon Musk | ఎలాన్ మస్క్-కాన్యే వెస్ట్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తమ సంస్థ నియమాలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై యే ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది. దాంతో ఎలాన్ మస్క్‌ను హాఫ్ చైనీస్ అంటూ యే సంభోదించాడు.
Kanye west VS Elon Musk | ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్, అమెరికా ర్యాపర్ కాన్యే వెస్ట్ మధ్య మాటల యుద్ధం జోరందుకున్నది. తన సంస్థ నియమాన్ని ఉల్లంఘించిన కాన్యే వెస్ట్ (ప్రస్తుతం యే గా పేరు మార్చుకున్నాడు) ట్విట్టర్ ఖాతాను ఎలాన్ మస్క్ సస్పెండ్ చేశాడు. దాంతో ఎలాన్ మస్క్‌పై యే తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఎలాన్ మస్క్‌ను హాఫ్ చైనీస్ అంటూ యే సంభోదించాడు. యే పోస్టుపై ఎలాన్ మస్క్ కూడా తీవ్రంగానే స్పందించాడు.
హింసను ప్రేరేపించడానికి వ్యతిరేకంగా ట్విట్టర్ సంస్థ నియమాన్ని కాన్యే వెస్ట్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనపై చర్యలు తీసుకుంటూ ఆయన ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారు. దీనిపై కాన్యే వెస్ట్ తీవ్రంగా మండిపడ్డారు. మస్క్‌ను ‘హాఫ్ చైనీస్’ అని సంభోదించే పోస్ట్‌ను యే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆయన ఫొటోలను నిశితంగా గమనిస్తే మీకే బోధపడుతుంది అని రాశాడు. చర్చిలో శాపం పదాలను ఉపయోగించినందుకు క్షమించండి.. ఇంతవరకు తన వద్ద ఒబామాకు మరో పదం లేదని పోస్ట్ చివర్లో రాశాడు. క్యాప్షన్‌లో తనను తాను యునైటెడ్ స్టేట్స్ భవిష్యత్ అధ్యక్షుడిగా యే పేర్కొన్నాడు. కాగా, యే వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ స్పందించాడు. యే వ్యాఖ్యలను తాను అభినందనగానే తీసుకుంటానని పేర్కొన్నాడు.
నాజీలకు చెందిన స్వస్తిక్ చిహ్నాన్ని తన ప్రచార చిత్రంగా కాన్యే వెస్ట్ ట్వీట్ చేశాడు. దీనిని ట్విట్టర్ సంస్థ తీవ్రంగా పరిగణించింది. తమ నియమాలకు విరుద్ధంగా ఉన్నదంటూ ఆక్షేపణలు చెప్తూ కాన్యే వెస్ట్ ఖాతాను నిలిపివేసింది. గతంలో కాన్యే వెస్ట్ సెమిటిక్ వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో అడిడాస్, గ్యాప్, బాలెంకిగా వంటి హై-ఎండ్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కోల్పోయి అనేక పరిణామాలను ఎదుర్కొన్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

