Jet 2 flight | ముప్పై వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కు గుండెపోటు..!
Jet 2 flight | విమానం గాల్లో 30,000 అడుగుల ఎత్తులో ఉండగా పైలట్ (Pilot) కు గుండెపోటు (Heart Attack) వచ్చిన ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. విమానం టెనెరెట్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళుతున్న జెట్2 విమానంలో పైలట్‌కు గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని పోర్చుగల్‌లోని ఫ్రాన్సిస్కో సా కార్నీరో ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వెంటనే పైలట్‌కు వైద్యసాయం అందించారు.
Jet 2 flight : విమానం గాల్లో 30,000 అడుగుల ఎత్తులో ఉండగా పైలట్ (Pilot) కు గుండెపోటు (Heart Attack) వచ్చిన ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. విమానం టెనెరెట్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళుతున్న జెట్2 విమానంలో పైలట్‌కు గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని పోర్చుగల్‌లోని ఫ్రాన్సిస్కో సా కార్నీరో ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వెంటనే పైలట్‌కు వైద్యసాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. జెట్2 విమానం శుక్రవారం తెల్లవారుజామున స్పెయిన్‌లోని టెనెరెట్ నుంచి బర్మింగ్‌హామ్‌కు బయల్దేరింది. విమానం 30,000 అడుగుల ఎత్తులో ఉండగా.. పైలట్‌కు గుండెపోటు వచ్చింది.
దాంతో కో పైలట్.. వెంటనే దగ్గరలో ఉన్న ఫ్రాన్సిస్కో సా కార్నీరో ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. విమానం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే సమయానికి అధికారులు అత్యవసర వైద్య ఏర్పాట్లు చేసి పైలట్‌కు వెంటనే వైద్యసాయం అందించారు. ఘటన సమయంలో విమానంలో 220మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటన నేపథ్యంలో గంటకు పైగా విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. ఎయిర్‌లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు దాదాపు 13 గంటల పాటు టెర్మినల్‌లోనే ఉన్నామని చెప్పారు.
అయినా అధికారులు తమకు ఎటువంటి వసతి ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. శనివారం మరో విమానం ఏర్పాటు చేయడంతో బర్మింగ్‌హామ్‌కు చేరుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి జెట్2 క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత విషయంలో తమ ఎయిర్‌లైన్స్ ఎప్పుడూ రాజీ పడబోదని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

