JD Vance | నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన జేడీ వాన్స్ సతీమణి.. ఏం పేరు పెట్టారంటే..!
JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) ఇవాళ తన కుటుంబానికి సంబంధించిన ఓ విషయంలో శుభవార్త పంచుకున్నారు. తన సతీమణి ఉషా వాన్స్ (Usha Vance) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఆ బిడ్డకు అలెక్ నీల్ వాన్స్ (Alec Neel Vance) అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) ఇవాళ తన కుటుంబానికి సంబంధించిన ఓ విషయంలో శుభవార్త పంచుకున్నారు. తన సతీమణి ఉషా వాన్స్ (Usha Vance) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఆ బిడ్డకు అలెక్ నీల్ వాన్స్ (Alec Neel Vance) అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వాన్స్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తమ ముగ్గురు పిల్లలు తమ్ముడిని చూసి ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు.
కాగా 2014లో ఉష, జేడీ వాన్స్ వివాహం చేసుకున్నారు. వారికి ఇప్పటికే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఇవాన్కు తొమ్మిదేళ్లు, రెండో కుమారుడు వివేక్కు ఆరేళ్లు, కుమార్తె మిరాబెల్కు నాలుగేళ్లు. ఇప్పుడు నాలుగో సంతానానికి జన్మనిచ్చారు. ఉషా వాన్స్ తెలుగు మూలాలున్న వ్యక్తి. ఈ క్రమంలోనే తమ చిన్న కుమారుడి పేరులో ‘నీల్’ అనే పదం చేర్చినట్లు తెలుస్తోంది.
కాగా అమెరికా చరిత్రలో గడిచిన 156 ఏళ్లలో ఏ ఉపాధ్యక్షుడు కూడా పదవిలో ఉండగా బిడ్డను కనలేదు. ఇప్పుడు సిట్టింగ్ వైస్ ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ బిడ్డను కన్నారు. అంతకుముందు చివరిసారిగా 1870 లో నాటి ఉపాధ్యక్షుడు కోల్ఫాక్స్ పదవిలో ఉండగా ఆయన భార్య ఎల్లెన్ మగబిడ్డకు జన్మనిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

