టోక్యో : జపాన్లో తొలిసారిగా 100 అంతకన్నా ఎక్కువ వయస్సు గల పౌరుల సంఖ్య లక్ష దాటింది. దేశంలో సెప్టెంబర్ 1 నాటికి శతాధిక వృద్ధుల సంఖ్య 1,07,677కు చేరుకున్నట్టు ఆ దేశ ఆరోగ్య, కార్మిక సంక్షేమ శాఖ వెల్లడించింది.
గత ఏడాదితో పోలిస్తే ఇది 7,914 ఎక్కువ. శతాధిక వృద్ధుల్లో మహిళలు 94,298 మంది ఉండగా, పురుషులు 13,779 మంది ఉన్నారు.