సాధారణంగా సైకిల్ తొక్కితే ఫిట్‌గా ఉంటాం అంటారు. కానీ.. ఈ సైకిల్ తొక్కితే మాత్రం ఫిట్‌గా ఉండటం పక్కన పెడితే నచ్చిన సాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. సైకిల్ తొక్కితే సాక్స్ ఎలా తయారవుతాయి అని అనుకుంటున్నారా? పదండి ఓసారి జపాన్ వెళ్లి దాని సంగతేంటో తెలుసుకుందాం.
జపాన్‌కు చెందిన సౌకీ సాక్స్ అనే సాక్స్ ఫ్యాక్టరీ ఒక మెషిన్‌ను తయారు చేసింది. ఆ మెషిన్ ఏంటి అంటే.. సాక్స్ తయారు చేసే మెషిన్. దానికి ఒక సైకిల్‌ను అటాచ్ చేశారు. సైకిల్ ఎక్కి తొక్కితే సాక్స్ తయారు అవుతాయి. ఎటువంటి మ్యాన్ పవర్ అవసరం లేకుండా కేవలం సైకిల్ మీద కూర్చొని తొక్కితే చాలు.. మెషిన్ లోపలి నుంచి సాక్స్ బయటికి వస్తాయి. విచిత్రంగా ఉంది కదా.
సైకిల్ తొక్కడం అందరికీ ఇష్టమే. కానీ.. ఇలా సైకిల్ తొక్కితే సాక్స్ రెడీ అవుతాయి. ఆ మెషిన్ పేరు చరిక్స్. 2017లో దీన్ని జపాన్‌లోని నారా ప్రెఫెక్షర్ అనే ఏరియాలో ఏర్పాటు చేశారు. ఆ ఫ్యాక్టరీకి వెళ్లి నచ్చిన రంగుల్లో, నచ్చిన సైజ్‌లో కస్టమర్లే సాక్సులను తయారు చేసుకోవచ్చు. దాని కోసం.. అక్కడ ఏర్పాటు చేసిన సైకిల్ ఎక్కి తొక్కేయడమే.
సైకిల్ ఎక్కి ఓ 10 నిమిషాల పాటు తొక్కితే చాలు. సాక్స్ రెడీ అయిపోతాయి. వాటికి చివర్లో కుట్లేసి కస్టమర్లకు అక్కడికక్కడే అందిస్తారు. ఆన్లైన్లో కూడా ఈ సాక్స్‌లను ఆర్డర్ చేసుకోవచ్చు. సైజ్, కలర్ లాంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే కంపెనీ వాళ్లే కస్టమర్ల కోసం సైకిల్ తొక్కి సాక్స్‌లను తయారు చేసి ఇంటికి డెలివరీ చేస్తారు. ఇంతకీ.. ఆ సైకిల్‌ను ఎలా తొక్కాలి.. ఎలా సాక్సులను తయారవుతాయి.. ఇంతకీ ఆ మెషిన్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియోను చూసేయండి.