Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని అబేను చంపిన నిందితుడికి జీవితకాల జైలుశిక్ష
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేసిన 45 ఏళ్ల టెట్సుయా యమగామికి జీవితకాల జైలుశిక్ష పడింది. నారా జిల్లా కోర్టు ఆ శిక్షను ఇవాళ ఖరారు చేసింది. మాజీ ప్రధానిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేసిన 45 ఏళ్ల టెట్సుయా యమగామికి జీవితకాల జైలుశిక్ష పడింది. నారా జిల్లా కోర్టు ఆ శిక్షను ఇవాళ ఖరారు చేసింది. మాజీ ప్రధానిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. జపాన్ అధికార పార్టీ, వివాదాస్పద దక్షిణకొరియా చర్చి మధ్య సంబంధాలను వ్యతిరేకిస్తూ నిందితుడు మాజీ ప్రధాని హత్యకు ప్లాన్ చేశాడు. జపాన్ రాజకీయాల్లో అత్యధిక కాలం ప్రధానిగా చేసిన వ్యక్తిగా అబెకు రికార్డు ఉన్నది. అయితే ప్రధాని హోదాను విడిచిన తర్వాత ఆయన ఎంపీగా కొనసాగారు.
నారా సిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అబేపై 2022లో కాల్పులు జరిపారు. గన్ కంట్రోల్‌పై పట్టు ఉండే జపాన్‌లో ఆ ఘటన జరగడం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. వివాదాస్పద చర్చితో లింకున్న గ్రూపులో అబే ఓ వీడియో మెసేజ్ షేర్ చేశారని, ఆ మెసేజ్ చూసిన తర్వాత మాజీ ప్రధాని హత్యకు ప్లాన్ వేసినట్లు నిందితుడు తెలిపారు. చర్చి విధానాలను వ్యతిరేకించిన నింతుడు మాజీ ప్రధానిని టార్గెట్ చేసుకున్నాడు.
వాస్తవానికి యునిఫికేషన్ చర్చి నేతను నిందితుడు తొలుత చంపాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత తన ప్లాన్‌ను మార్చుకుని అబేను టార్గెట్ చేశాడు. యునిఫికేషన్ చర్చిని తన తల్లి గుడ్డిగా నమ్మిందని, ఆ చర్చికి అంతులేని రీతిలో దానాలు చేసిందని, దాని వల్ల తన కుటుంబం నాశనమైందని, ఈ నేపథ్యంలోనే ఆ చర్చి గ్రూపుకు సపోర్టు ఇస్తున్న అబేను చంపాలని భావించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. మతపరమైన సంస్థలు సైకలాజికల్‌గా, ఆర్థికంగా మద్దతుదారులను వాడుకుంటున్న తీరు, అలాంటి గ్రూపులతో నేతలకు ఉన్న లింకులపై విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

