Japan Earthquake | మెగా భూకంపం హెచ్చరికల నేపథ్యంలో జపాన్‌లో మళ్లీ భూకంపం..!
Japan Earthquake | జపాన్‌లో వరుసగా రెండో రోజు కూడా భూకంపం సంభవించింది. పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఒక రోజు తర్వాత శుక్రవారం సాయంత్రం టోక్యో, దాని పరిసర ప్రాంతాల్లో 5.3 తీవ్రవతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
Japan Earthquake : జపాన్‌లో వరుసగా రెండో రోజు కూడా భూకంపం సంభవించింది. పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఒక రోజు తర్వాత శుక్రవారం సాయంత్రం టోక్యో, దాని పరిసర ప్రాంతాల్లో 5.3 తీవ్రవతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
సునామీ హెచ్చరికలు చేయనప్పటికీ కనగావా, సైతామా, యమనాషి, షిజుయోకా ప్రిఫెక్చర్లలో బలమైన ప్రకంపనలు వస్తాయని ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. హెచ్చరికల నేపథ్యంలో టోక్యోలోని చాలా భవనాలు కంపించాయి. టోక్యో మెట్రోని నిలిపేశారు. అంతకుముందు రోజు జపాన్‌లో రెండు బలమైన భూకంపాలు సంభవించాయి.
రెండు భూకంపాలు 7.1, 6.9 తీవ్రతతో వచ్చాయి. వెంటనే జపాన్ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 50 సెంటీమీటర్ల మేర సునామీ జపాన్ తీరాన్ని తాకింది. దక్షిణ మియజాకి రాష్ట్రంలోని మియజాకీ పోర్ట్‌లో సునామీ అలలు ఎగిసిపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే రానున్న రోజుల్లో మెగా భూకంపం వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నారు.
జపాన్ ప్రజలు ‘మెగాక్వేక్’ కు సిద్ధం కావాలని చెప్పారు. గతంలో భారీ భూకంపాలు సంభవించిన పసిఫిక్ మహాసముద్రంలోని రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఉన్న నాంకై ట్రఫ్ ‘సబ్డక్షన్ జోన్’ లోనే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 800 కిలోమీటర్ల సముద్ర గర్భంలో ఉన్న ఈ ప్రాంతం టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజుయోకా నుంచి క్యుషు ద్వీపంలోని దక్షిణ కొనవరకు ఉంటుంది.
ఇది ప్రతీ శతాబ్ధానికి లేదా రెండు శతాబ్ధాలకు 8 లేదా 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతం. వీటిని ‘మెగాథ్రస్ట్ భూకంపాలు’ అంటారు. తరుచుగా ఇక్కడ సంభవించే భూకంపాలు ప్రమాదకరమైన సునామీలను కలిగిస్తాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

