Israel-Hamas War | ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై చైనాలో దాడి.. కత్తిపోట్లతో ఆసుపత్రిపాలు
Israel-Hamas War | ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై చైనాలో దాడి జరిగింది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిని కత్తితో పొడిచారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ దాడికి కారణం ఏమిటన్నది తెలియలేదని పేర్కొంది.
బీజింగ్: ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై చైనాలో దాడి జరిగింది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిని కత్తితో పొడిచారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ దాడికి కారణం ఏమిటన్నది తెలియలేదని పేర్కొంది. అలాగే కత్తి దాడికి ఎవరూ బాధ్యత వహించలేదని చెప్పింది. బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో కాకుండా మరోచోట ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది.
కాగా, గత శనివారం ఐదు వేల క్షిపణులతో హమాస్ దాడులు చేయడం, పలువురు పౌరులు, సైనికులను చంపడంపై ఇజ్రాయెల్ రగిలిపోతున్నది. గాజాపై వరుసగా విరుచుకుపడుతున్నది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరుగడంతో శక్రవారం ముస్లింలు తమ ఆవేశాన్ని ప్రదర్శించాలని హమాస్ పిలుపునిచ్చింది. దీంతో పలు దేశాల్లో ముస్లింలు హమాస్‌కు మద్దతుగా ప్రార్థనలు చేయడంతోపాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెలీలు, యూదులు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వ్యాప్తంగా సూచనలు జారీ అయ్యాయి.
https://twitter.com/AdityaRajKaul/status/1712770124615155936?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1712770124615155936%7Ctwgr%5E41bf419c6b4f5b518e5a15821c4b1a0e2f4472b0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fworld%2Fchina-israeli-embassy-staffer-stabbed-in-beijing-claims-report
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Diplomat
- Gaza
- Hospitalised
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

