Israel Vs Iran | మిస్సైల్ దాడులను ఆకపోతే.. టెహ్రాన్ కాలిపోతుంది..! ఇరాన్‌ను హెచ్చరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి..!
Israel Vs Iran | ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ శనివారం ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మిస్సైల్స్‌ను ప్రయోగించకపోవడం ఆకపకపోతే.. టెహ్రాన్ మంటల్లో కాలిపోతుందంటూ హెచ్చరించారు.
Israel Vs Iran | ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ శనివారం ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మిస్సైల్స్‌ను ప్రయోగించకపోవడం ఆకపకపోతే.. టెహ్రాన్ మంటల్లో కాలిపోతుందంటూ హెచ్చరించారు. రక్షణ మంత్రి శనివారం ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇయాల్ జమీర్, మోసాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నియా, ఇతర ఉన్నత సైనిక అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై సమావేశం నిర్వహించారు. ఇజ్రాయెల్ పౌరులకు ఇరాన్ హాని కలిగిస్తే.. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. అయతుల్లా అలీ ఖమేని ఇజ్రాయెల్ దేశీయ సరిహద్దుపై మిస్సైల్స్ దాడి చేస్తూనే ఉంటే.. టెహ్రాన్ కాలిపోతుందన్నారు.
ఇరాన్ దాడుల తర్వాత కాట్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దాడులకు సమాధానంగా ఇరాన్ సైతం ప్రతీకారం తీర్చుకుంది. పెద్ద సంఖ్యలో మిస్సైల్స్‌ను ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అణు, సైనిక స్థావరాలకే పరిమితం చేయడంతో పాటు వాటితో సంబంధం ఉన్న కీలక అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ వస్తున్నది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా ఇజ్రాయెల్ ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయాల్సి వచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు విమానాశ్రయం మూసే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇరాన్ నిన్న రాత్రి నుంచి ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఐడీఎఫ్ పేర్కొంది.
చాలా క్షిపణులను అడ్డుకున్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. తక్కువ సంఖ్యలో క్షిపణులు ఎయిర్ డిఫెన్స్‌లోకి చొచ్చుకు వచ్చాయని.. దాంతో ప్రాణనష్టం వాటిల్లిందని సైన్యం పేర్కొంది. క్షిపణులు పడిపోయిన ప్రదేశాలలో టెల్ అవీవ్, రామత్ గాన్, సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని రిషోన్ లెజియాన్ నివాస ప్రాంతాలు ఉన్నాయని సైన్యం పేర్కొంది. ఇరాన్ క్షిపణి దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారని, మరో 70 మంది గాయపడ్డారని సమాచారం సమాచారం. అయితే, వైమానిక స్థావరాలు సహా తమ అన్ని స్థావరాలు సాధారణంగా పనిచేస్తున్నాయని, ఎలాంటి వాటిల్లలేదని ఐడీఎఫ్ పేర్కొంది. శుక్రవారం ప్రయోగించిన వంద డ్రోన్లతో పాటు, రాత్రిపూట ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను వైమానిక దళం నేవీ కూల్చివేసినట్లు సైన్యం వివరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

