Israel – Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం (Israel – Hamas War) కొనసాగుతోంది. హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. హమాస్ చెరలో ఉన్న బందీలను (Hostages) విడిపించేందుకు ఐడీఎఫ్ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగానే హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై భీకర దాడులు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే గాజా (Gaza)లోని హమాస్‌కు చెందిన ఓ సొరంగంలో (Hamas Tunnel) ఐదుగురు బందీల మృతదేహాలను ఐడీఎఫ్ తాజాగా గుర్తించింది. ఈ సొరంగానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. అక్టోబర్ 7 ఊచకోత సమయంలో అపహరణకు గురైన 5 గురు బందీల మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించింది. బందీల డెడ్‌బాడీస్‌ను ఇజ్రాయెల్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వారి మృతికి నివాళులర్పించింది.
In a centralized intelligence effort, IDF troops located and recovered the bodies of 5 hostages—abducted during the October 7 Massacre—and brought them back to Israel:
🕯️WO Ziv Dado
🕯️SGT Ron Sherman
🕯️CPL Nik Beizer
🕯️Eden Zacharia
🕯️Elia ToledanoMay their memory be a… pic.twitter.com/tq1UlLo8Z2
— Israel Defense Forces (@IDF) December 24, 2023
Also Read..
Car Pileup | యూపీలో ఘోర ప్రమాదం.. పొగమంచు కారణంగా ఢీకొన్న 10 వాహనాలు
Shimla | న్యూఇయర్ వేళ సిమ్లాకు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
Coronavirus | డేంజర్ బెల్స్.. దేశంలో 63 మందికి కొత్త వేరియంట్ జేఎన్.1