Israel: ఇరాన్ బెదిరింపు నేపథ్యంలో.. హై అలర్ట్‌లో ఇజ్రాయిల్
Israel: ఇరాన్ ఎక్కడ దాడి చేస్తుందో అని ఇజ్రాయిల్ కంటి మీద కునుకు లేకుండా గడిపింది. డమస్కస్ ఘటనకు ప్రతీకారంగా ఇరాన్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇజ్రాయిల్ హై అలర్ట్‌లో ఉంది.
గాజా: ఇజ్రాయిల్(Israel)పై ఏ క్షణమైనా ఇరాన్ అటాక్ చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీన డమస్కస్‌లో జరిగిన ఓ దాడి కేసులో ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్‌పై అటాక్ చేయాలన్న దీక్షతో ఉన్నది. శుక్రవారం ఎటువంటి దాడి జరగపోయినా. ఇజ్రాయిల్ రక్షణ దళాలు మాత్రం హై అలర్ట్‌లో ఉన్నాయి. కొన్ని చోట్ల యాంటీ మిస్సైల్ మొబైల్ లాంచర్లను అప్రమత్తం చేశారు. ఇరాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ దళాలు కంటి మీద కునుకు లేకుండా జాగ్రత్తగా ఉన్నాయి. లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లా కేంద్రాన్ని శుక్రవారం టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ప్రకటించింది.
ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. లుఫ్తాన్సా విమాన సంస్థ తమ విమానాలను నిలిపివేసింది. ఇరాన్ వైమానిక మార్గాన్ని వాడడం లేదని చెప్పింది. టెహ్రాన్ నుంచి వచ్చి వెళ్లే విమానాలను రద్దు సస్పెండ్ చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ పేర్కొన్నది. ఏప్రిల్ 18వ తేదీ వరకు విమానాల రాకపోకలు ఉండదని, ఇరానియన్ ఎయిర్ స్పేస్‌ను కూడా వాడడం లేదని లుఫ్తాన్సా చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

