జెరుసలాం: ఇరాన్‌పై రెండు వారాల పాటు బాంబుల వర్షాన్ని ఆపనున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రే ఇరాన్ నాగరికతను అంతం చేస్తానని వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ(Benjamin Netanyahu) స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తన ఎక్స్ అకౌంట్లో ఈ అంశాన్ని పోస్టు చేసింది. ట్రంప్‌నకు ఈ అంశంలో మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. కానీ ఆ ఒప్పందంలో లెబనాన్‌ను మినహాయిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు.
ఇరాన్ తక్షణమే హోర్ముజ్ జలసంధిని తెరుస్తుందని, దీనిలో భాగంగా ఇరాన్‌పై రెండు వారాల పాటు దాడులు చేయబోమని, ఈ అంశంలో ట్రంప్ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని నెతన్యహూ తెలిపారు. భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాన్ని కానీ, అణు క్షిపణిని కానీ కలిగి ఉండడాన్ని వ్యతిరేకిస్తామని, ఈ అంశంలో అమెరికా నిర్ణయానికి మద్దతు ఇస్తామన్నారు. గల్ఫ్ దేశాలకు కూడా ఇరాన్ సమస్య కావొద్దు అన్నారు. తమ లక్ష్యాలను అందుకునేందుకు కలిసి పనిచేయనున్నట్లు అమెరికా తమకు చెప్పినట్లు నెతన్యహూ తెలిపారు.
రెండు వారాల కాల్పుల విరమణలో లెబనాన్‌ను మినహాయిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ మధ్యవర్తులు మాత్రం లెబనాన్‌కు కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందన్నారు. ఈ అంశంలో క్లారిటీ లేదు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే తన స్టేట్మెంట్ను రిలీజ్ చేసింది.
Prime Minister’s Office:
Israel supports President Trump’s decision to suspend strikes against Iran for two weeks subject to Iran immediately opening the straits and stopping all attacks on the US, Israel and countries in the region.
— Prime Minister of Israel (@IsraeliPM) April 8, 2026