Israel – Hamas War | గాజాలోని హమాస్ చీఫ్ ఇంటిపై బాంబుల వర్షం.. వీడియో రిలీజ్ చేసిన ఐడీఎఫ్
Israel - Hamas War | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం (Israel - Hamas War) కొనసాగుతోంది. హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో తాజాగా హమాస్ చీఫ్ (Hamas Political Chief) ఇంటిపై బాంబుల వర్షం కురిపించాయి.
Israel – Hamas War | ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం (Israel – Hamas War) కొనసాగుతోంది. హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. గాజాను చుట్టుముట్టిన ఐడీఎఫ్ దళాలు.. హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హమాస్ చీఫ్ (Hamas Political Chief) ఇంటిపై బాంబుల వర్షం కురిపించాయి.
గాజాలోని హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే (Ismail Haniyeh) ఇంటిపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో హనియే ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. హనియే ఇల్లు ‘టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయం’ గా ఐడీఎఫ్ అభివర్ణించింది. ఇజ్రాయెల్ సైన్యం, పౌరులపై తీవ్రవాద దాడులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడే జరుగుతుంటాయిని తెలిపింది. ఇక్కడి నుంచే ఆదేశాలు వెళ్తుంటాయని పేర్కొంది.
חטיבת האש 215 באוגדה 162 תקפה הלילה באמצעות מטוסי קרב את ביתו של איסמעיל הנייה, ראש הלשכה המדינית של ארגון הטרור חמאס ששימש כתשתית טרור ובין היתר כמקום מפגש עבור בכירי הארגון>> pic.twitter.com/eCwd4lmrFF
— צבא ההגנה לישראל (@idfonline) November 16, 2023
ఎవరీ హనియే..?
హనియే.. హమాస్ పొలిటికల్ బ్యూరో అధిపతి, గాజాను పాలించే సంస్థలో అత్యున్నత స్థాయి అధికారుల్లో ఒకరు. హనియేని పలు దేశాలు హమాస్‌కు అధిపతిగా గుర్తించాయి. 1990లలో ఇస్మాయిల్ హనియే లైమ్ లైట్లోకి వచ్చారు. అప్పట్లో ఆయన హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్‌కు కుడిభుజంగా వ్యవహరించారు. 2004లో యాసిన్ హత్యకు గురయ్యారు. ఆయన మరణం తర్వాత హమాస్ పగ్గాలు చేపట్టిన హనియే.. ఆ సంస్థను విజయపథంలో నడిపించాడు. ఇక 2006లో జరిగిన ఎన్నికల్లో హమాస్ గ్రూపు గెలుపుతో ప్రధానమంత్రి అయ్యారు. 2017లో ఆయన హమాస్ అధినేత అయ్యారు.
Also Read..
Israel – Hamas War | ఆసుపత్రి ఎంఆర్ఐ యూనిట్లో పెద్ద ఎత్తున ఆయుధాలు.. వీడియో రిలీజ్ చేసిన ఐడీఎఫ్
China Fire Accident | చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది మృతి
New York Diwali | న్యూయార్క్‌లో పాఠశాలలకు దీపావళి నాడు సెలవు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

