New York Diwali | చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దీపావళి (Diwali) పండుగను ఘనంగా జరుపుకుంటారు. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు సైతం ఈ పండుగను ఏటా ఎంతో సందడిగా జరుపుకుంటుంటారు. కాగా, హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు అమెరికాలోని న్యూయార్క్ (New York) రాష్ట్రం ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా (School Holiday) ప్రకటించింది. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ సంతకం చేశారు. తద్వారా ఇక నుంచి భారతీయ కేలండర్ ప్రకారం పాఠశాలలు దీపావళి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. న్యూయార్క్ నగరంలో విభిన్న సంస్కృతులకు చెందిన వారు కలిసిమెలిసి జీవిస్తున్నట్లు చెప్పారు. ఆ భిన్నత్వాన్ని పాఠశాలల్లో సంబరంలా జరుపుకోవడం అవసరమన్నారు. ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై న్యూయార్క్‌లోని తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Nana Patekar | సెల్ఫీ కోసం వచ్చిన యువకుడిని కొట్టడంతో విమర్శలు.. క్షమాపణలు కోరిన నానా పటేకర్
Earthquake | జమ్మూ కశ్మీర్లో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Vande Mataram | మా తుఝే సలామ్‌తో హోరెత్తిన వాంఖడే.. వీడియో వైరల్