లేజర్ కిరణాలతో శత్రు విమానాలు తునాతునకలు
అత్యాధునిక సాంకేతికతలను కాలానుగుణంగా నవీకరించే ఇజ్రాయెల్ మరో వినూత్న సాంకేతికతను ఆవిష్కరించింది. లేజర్ కిరణాలతో శత్రు విమానాలను తుత్తునియలు చేసే అధునాతన టెక్నాలజీని రూపొందించింది. ‘ఐరన్ బీమ్'గా పిలిచే ఈ సరికొత్త ఆయుధ వ్యవస్థను విజయవంతంగా
- ఇజ్రాయెల్ అమ్ములపొదిలో వినూత్న ఆయుధం
- అత్యంత చవగ్గా రూ. 267తోనే కూల్చే సామర్థ్యం
- శత్రు విమానంలోని నిర్ణీత భాగాలపై కూడా అటాక్
అత్యాధునిక సాంకేతికతలను కాలానుగుణంగా నవీకరించే ఇజ్రాయెల్ మరో వినూత్న సాంకేతికతను ఆవిష్కరించింది. లేజర్ కిరణాలతో శత్రు విమానాలను తుత్తునియలు చేసే అధునాతన టెక్నాలజీని రూపొందించింది. ‘ఐరన్ బీమ్’గా పిలిచే ఈ సరికొత్త ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.
ఏమిటీ ఐరన్ బీమ్?
శత్రువులు ప్రయోగించే రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లు (సీ-రావ్‌ు), విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను పసిగట్టి వాటిని గాల్లోనే పూర్తిగా, పాక్షికంగా ధ్వంసంచేసేదే ‘ఐరన్ బీమ్’
ఎందుకు తీసుకొచ్చారు?
గాజాలోని హమాస్ ఉగ్రవాదులు గత ఏడాది చేసిన రాకెట్ దాడులను తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ ‘ఐరన్‌డోమ్’ను వాడటం తెలిసిందే. అయితే, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై 1,200 వరకు రాకెట్లను ప్రయోగించారు. వీటిలో 200 రాకెట్లను డోవ్ు ధ్వంసం చేసింది. దీని కోసం రూ. 235 కోట్లు ఖర్చు చేసింది. మిగతా వెయ్యి రాకెట్లను నిర్వీర్యం చేయలేకపోయింది. దీంతో ఇజ్రాయెల్‌లో భారీగా నష్టం సంభవించింది. ఈ క్రమంలోనే.. ప్రతీ రాకెట్, డ్రోన్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ ‘ఐరన్ బీమ్’ను తీసుకొచ్చారు. లేజర్ కిరణాల సాయంతో ఇది పనిచేస్తుంది.
ప్రత్యేకతలేంటి?
‘ఐరన్‌డోమ్’తో ఒక్క రాకెట్‌ను పేల్చడానికి ఇప్పటివరకూ ఇజ్రాయెల్‌కు రూ. కోటి కంటే ఎక్కువ ఖర్చయ్యేది. ‘ఐరన్ బీమ్’తో 3.5 డాలర్లతోనే (రూ. 267) ఒక్కో లక్ష్యాన్ని కూల్చేయవచ్చు. ఇంత చవకైన సిస్టమ్ ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా లేదు.
శత్రువుల విమానాన్ని పూర్తిగా లేక పాక్షికంగా నాశనం చేసే సామర్థ్యం దీని సొంతం. దీని కోసం లేజర్ కిరణాల తీవ్రతను మార్చుకొనే వెసులుబాటు ఉంది. అలాగే విమానంలోని నిర్ణీత భాగాన్ని మాత్రమే కూల్చే ప్రత్యేకతలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

