Mahan Air Craft | మెడిసిన్ కోసం భారత్‌కు రావాల్సిన విమానంపై అమెరికా దాడి.. యుద్ధ చర్యేనని విరుచుకుపడ్డ ఇరాన్
Mahan Air Craft | ఇరాన్ (Iran) నుంచి భారత్ (India) కు రావాల్సిన పౌర విమానంపై దాడి జరిగింది. భారత్ నుంచి మెడిసిన్, వైద్య సామాగ్రిని తరలించాల్సిన విమానంపై అమెరికా (USA) నే దాడి చేసిందని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ (Iran Embassy) ఆరోపించింది.
Mahan Air Craft : ఇరాన్ (Iran) నుంచి భారత్ (India) కు రావాల్సిన పౌర విమానంపై దాడి జరిగింది. భారత్ నుంచి మెడిసిన్, వైద్య సామాగ్రిని తరలించాల్సిన విమానంపై అమెరికా (USA) నే దాడి చేసిందని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ (Iran Embassy) ఆరోపించింది. ఈ ఘటనను యుద్ధ చర్యగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ఇరాన్ రాయబార కార్యాలయం విరుచుకుపడింది.
పలు దేశాల నుంచి ఇరాన్‌కు మందులు, వైద్య పరికరాలను రవాణా చేస్తూ మషద్ విమానాశ్రయంలో దిగిన పౌర విమానంపై అమెరికా-ఇజ్రాయెల్ దాడికి పాల్పడ్డాయని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడిలో విమానం దెబ్బతిన్నట్లు తెలిపింది. దీన్ని ఇరాన్ పౌర విమానయాన శాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంబసీ పేర్కొన్నది. మానవతా సాయాన్ని తరలించే పౌర విమానాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పింది.
ఇది యుద్ధచర్యేనని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై విచారణ జరపాలని అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చింది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ప్రజల కోసం భారత్ మానవతా సాయం చేస్తున్నది. అందులోభాగంగానే మహాన్ ఎయిర్‌కు చెందిన విమానం మందులు, వైద్య సామగ్రిని తీసుకెళ్లేందుకు ఈ వారంలో భారత్‌కు రావాల్సిఉంది. ఈ క్రమంలోనే అది మషద్ విమానాశ్రయంలో ఉండగా దాడి జరిగింది.
తాజా ఘటన నేపథ్యంలో ఇరాన్‌కు అందే సహాయక చర్యలకు అంతరాయం కలుగనుంది. అయితే ఈ దాడికి సంబంధించి అమెరికా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

