Starlink | మస్క్ స్టార్‌లింక్‌ను మేం వదిలిపెట్టం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Starlink | ఇరాన్ తన పొరుగున ఉన్న దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతున్నది. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ (Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థను తమ లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని హెచ్చరించింది. బహ్రెయిన్, కువైట్, యూఏఈలలో స్టార్ లింక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Starlink : ఇరాన్ (Iran) తన పొరుగున ఉన్న దేశాల్లోని అమెరికా (US) స్థావరాలపై విరుచుకుపడుతున్నది. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ (Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థను తమ లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని హెచ్చరించింది. బహ్రెయిన్, కువైట్, యూఏఈ (UAE) లలో స్టార్ లింక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ గల్ఫ్ దేశాల్లోని స్టార్‌లింక్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని చెప్పింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న దాదాపు 18 అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసినట్లు తెలిపింది.
ఇరాన్ (Iran) దాడుల్లో తరచూ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ సమస్య తలెత్తుతుండడంతో పలు గల్ఫ్ దేశాలు స్టార్‌లింక్ శాటిలైట్‌కు చెందిన ఇంటర్నెట్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. దాంతో ఐఆర్జీసీ ఈ హెచ్చరికలు చేసింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబీఎం, డెల్, టెస్లా, బోయింగ్, హెచ్‌పీ, జేపీ మోర్గాన్ తదితర అమెరికా కంపెనీలకు చెందిన యూనిట్లపైనా ఏప్రిల్ 1 నుంచి దాడులు చేసే అవకాశం ఉంది. ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ప్రాణాలు కాపాడుకోవాలంటే తక్షణమే వెళ్లిపోవాలని.. స్థానిక నివాసితులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇరాన్ సైన్యం సూచించింది. ఇప్పటికే ఇరాన్లో స్టార్‌లింక్‌పై నిషేధం ఉంది. ఆ నెట్‌వర్క్‌ను ఉపయోగించిన వారికి టెహ్రాన్ ప్రభుత్వం రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

