Iran : అమెరికాకు చెందిన యుద్ధ విమానంపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. అంతేకాదు.. దానికి సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేసింది. అయితే, అదంతా ఫేక్ అని అమెరికా చెబుతోంది. తమ విమానం ఏదీ కూలలేదని అమెరికా అంటోంది. ఇరాన్ ప్రకారం.. గల్ఫ్ దేశమైన ఒమన్ తీరంలో, చాబహార్ పోర్టు వద్ద అమెరికాకు చెందిన ఎఫ్18 యుద్ధ విమానంపై దాడి జరిగింది.
ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ ఈ దాడి చేసింది. తాము విజయవంతంగా అమెరికా యుద్ధ విమానాన్ని పేల్చేసామని ఇరాన్ ప్రకటించింది. తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో ఒక యుద్ధ విమానం గాల్లో ఎగురుతుండగా, ఏవో మిస్సైల్స్ వచ్చి విమానాన్ని ఢీకొన్నాయి. ఈ సమయంలో విమానంలోంచి పైలట్ ప్యారాచూట్ సాయంతో కిందకు దూకేశాడు. అయితే, అమెరికా యుద్ధ విమానంపై ఇరాన్ దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ నెలలోనే అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానంతోపాటు, ఎఫ్-35 అనే మరో స్టీల్త్ జెట్‌ను కూడా పేల్చేసింది. అయితే, ఈ పేలుళ్లను అమెరికా కొట్టిపారేసింది. ఇక, తాజా ఎఫ్18 యుద్ధ విమానాన్ని పేల్చేసామని ఇరాన్ చేసిన ప్రకటనను కూడా అమెరికా ఖండించింది.
Iran’s Islamic Revolution Guards Corps (IRGC) announces that it has successfully targeted an American F-18 fighter jet.
Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2J pic.twitter.com/E9nRJgnla3
— Press TV 🔻 (@PressTV) March 25, 2026
అదంతా ఫేక్ ప్రచారమని, తమ విమానం ప్రమాదానికి గురి కాలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అలాగే, ఇరాన్ సైనిక ప్రతినిధి ఎబ్రహిం జోల్ఫాఘరి మాట్లాడుతూ తాము గల్ఫ్ తీరంలోని అమెరికా యుద్ధ స్ధావరాలపై దాడుల చేశామని తెలిపాడు. సైనిక స్థావరాలన్నింటినీ తొలగించామని, ధ్వంసం చేశామని వెల్లడించాడు. అమెరికా కమాండర్లు అక్కడ్నుంచి పారిపోయినట్లు తెలిపాడు.