US Fighter Jet | అమెరికాకు మళ్లీ షాకిచ్చిన ఇరాన్.. రెస్క్యూ విమానం కూల్చివేత
US Fighter Jet | అగ్రరాజ్యం అమెరికా (USA) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన రెస్క్యూ విమానం C-130ని ఇరాన్ (Iran) బలగాలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని ఆదివారం ఇరాన్ ప్రకటించింది. ఇటీవల F-15E ఫైటర్ జెట్ ఇరాన్‌ను కూల్చింది. ఈ ఘటన జెట్‌లోని ఒక పైలట్ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్ గల్లంతయ్యాడు.
US Fighter Jet : అగ్రరాజ్యం అమెరికా (USA) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన రెస్క్యూ విమానం C-130ని ఇరాన్ (Iran) బలగాలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని ఆదివారం ఇరాన్ ప్రకటించింది. ఇటీవల F-15E ఫైటర్ జెట్ ఇరాన్‌ను కూల్చింది. ఈ ఘటన జెట్‌లోని ఒక పైలట్ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో తాము రెండో పైలట్‌ను కూడా రక్షించామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే రెండో పైలట్ కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అమెరికా విమానాన్ని తాము కూల్చివేశామని ఇరాన్ తెలిపింది.
తాము కూల్చిన యుద్ధ విమానం నుంచి గల్లంతైన పైలట్ కోసం గాలిస్తున్న అమెరికా రెస్క్యూ విమానాన్ని ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో ఐఆర్జీసీ దళాలు ధ్వంసం చేశాయని ఇరాన్ మీడియా పేర్కొన్నది. ఆ ఎయిర్‌క్రాఫ్ట్ అమెరికా వైమానిక దళానికి చెందిన C-130గా చెబుతోంది. ఫరాజ్ రేంజర్స్ అనే పోలీసు కమాండో యూనిట్ ఈ విమానాన్ని కూల్చివేసినట్లు ఖతార్ మీడియా తెలిపింది. ఇతర యూఎస్ ఫైటర్జెట్లకు రీఫ్యూయలింగ్ చేసేందుకు C-130 వచ్చినట్లు పేర్కొన్నది.
అందులోని సిబ్బందికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ఖతార్ మీడియా వెల్లడించలేదు. దీనిపై అమెరికా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలావుండగా.. అమెరికాకు చెందిన యుద్ధ విమానం F-15E స్ట్రైక్ ఈగల్‌ను కూల్చివేసిన ఘటనలో ఒక పైలట్ గల్లంతయ్యారు. ఈ క్రమంలో అమెరికా సైన్యం రెస్క్యూ నిర్వహించి అతడిని రక్షించింది. పైలట్ కోసం తమ సైన్యం సాహసోపేతమైన ఆపరేషన్ చేసి విజయం సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం తాము డజన్ల కొద్దీ విమానాలను పంపామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

