Iran Internet: ఇరాన్లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం.. కానీ ఆంక్షలు
Iran Internet: ఇరాన్లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే స్వల్ప స్థాయిలో ఇంటర్నెట్ యాక్సెస్‌లోకి వచ్చింది. గత కొన్ని నెలల నుంచి ఇరాన్లో ఇంటర్నెట్ అందుబాటులో లేదు. బుధవారమే ప్రభుత్వం మళ్లీ సేవల్ని ప్రారంభించింది.
న్యూయార్క్: ఇరాన్లో మళ్లీ ఇంటర్నెట్(Iran Internet) సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే స్వల్ప స్థాయిలో ఇంటర్నెట్ యాక్సెస్‌లోకి వచ్చింది. గత కొన్ని నెలల నుంచి ఇరాన్లో ఇంటర్నెట్ అందుబాటులో లేదు. బుధవారమే ప్రభుత్వం మళ్లీ సేవల్ని ప్రారంభించింది. కానీ నెట్ చాలా స్లోగా వస్తోంది. ఇంటర్నెట్పై ఆంక్షలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాధి నేతలకు వ్యతిరేకంగా జనవరిలో ఇరాన్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆ సమయంలో ఇంటర్నెట్పై ఆంక్షలు పెట్టారు. ఇక ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడి ప్రారంభించిన తర్వాత ఇరాన్లో ఇంటర్నెట్ పూర్తిగా బ్లాకౌట్ అయ్యింది.
ఇంటర్నెట్ ట్రాకింగ్ కంపెనీ నెట్‌బ్లాక్స్ దీనిపై రిపోర్టును రిలీజ్ చేసింది. షట్‌డౌన్ కన్నా ముందు ఉన్ననాటి పరిస్థితులతో పోలిస్తే 86 శాతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నెట్‌బ్లాక్స్ తెలిపింది. ఇక ఇంటర్నెట్ ట్రాఫిక్ సుమారు 40 శాతం ఉన్నట్లు కెంటిక్ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు ఉన్నాయని, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లపై ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
బ్లాక్ చేసిన సైట్లను వీక్షించేందుకు ఇరానీలు ఎక్కువగా వీపీఎన్‌పై ఆధారపడుతున్నట్లు తెలిసింది. ఇంటర్నెట్ నిషేధం వల్ల దేశంలో ఆన్లైన్ వ్యాపారం దెబ్బతిన్నది. నిరసనలు, యుద్ధం సమయంలో ఇరానీ కుటుంబాలు కమ్యూనికేట్ చేసుకునేందుకు ఇబ్బందిపడ్డాయి. అయితే అమెరికాతో శాంతి డీల్ కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటర్నెట్ను పాక్షికంగా పునరుద్దరించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
Sampath Nandi | పవన్ కల్యాణ్‌తో సినిమా చేయని సంపత్ నంది.. కారణం ఏంటో తెలుసా..?
Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

