Indonesia | ఇండొనేషియాలో మరోసారి బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం.. ఆకాశంలోకి ఎగసిపడుతున్న బూడిద
Indonesia | ఇండొనేషియాలోని (Indonesia) లెవోటోబి లకి లకి (Mount Lewotobi Laki Laki) అగ్నిపర్వతం మరోసారి బద్ధలైంది.
Indonesia | ఇండొనేషియాలోని (Indonesia) లెవోటోబి లకి లకి (Mount Lewotobi Laki Laki) అగ్నిపర్వతం మరోసారి బద్ధలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. ఇది ఇండొనేషియాలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది సోమవారం ఉదయం విస్ఫోటనం చెందింది.
అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలోకి 18 కిలోమీటర్ల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడుతోంది. దీంతో సమీపంలోని గ్రామాలను పెద్ద ఎత్తున బూడిద కప్పేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎలాంటి మరణాలూ సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు అగ్నిపర్వతం బద్దలవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బాలి (Bali)కి వెళ్లాల్సిన పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
1,584 మీటర్ల (5,197 అడుగులు) ఎత్తున్న లకిలకి అగ్నిపర్వతం చాలా క్రియాశీలకంగా ఉన్నది. ఇది విస్ఫోటనం చెందడం నెల వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెల 18వ తేదీన కూడా ఈ అగ్నిపర్వతం బద్దలైంది. అంతకుముందు ఈ ఏడాది మార్చి 21న విస్ఫోటనం చెందింది. గతేడాది నవంబర్‌లో కూడా బద్ధలైంది.
కాగా, ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్ క్రకటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలోపడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం కారణంగా 60 మందికిపైగా మరణించారు. సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించారు. మరోవైపు ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించారు.
Also Read..
PM Modi | భారత్, పాక్‌ను ఒకే త్రాసులో తూకం వేయలేం : ప్రధాని మోదీ
Donald Trump | బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌లు.. మరో బాంబు పేల్చిన ట్రంప్
Donald Trump | హాస్యాస్పదం.. ఎలాన్ మస్క్ పార్టీపై ట్రంప్ వ్యాఖ్యలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

