కాన్బెర్రా : ఆస్ట్రేలియాలోని వలసదారుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. బ్రిటన్ వలసదారులు ఇప్పటివరకు మొదటిస్థానంలో ఉండగా, తాజాగా భారతీయులు వారిని అధిగమించారు. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఆ దేశంలో ప్రవాస భారతీయుల సంఖ్య సుమారుగా 9,71,020కు చేరుకుంది.
అంటే దేశ జనాభాలో 5.2 శాతం మంది మనవాళ్లే. ఆ దేశానికి వలస వచ్చిన ఇంగ్లండ్ పౌరుల సంఖ్య 9,70,950గా ఉంది. 2013 గణాంకాలతో పోల్చితే ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ పౌరుల సంఖ్య 10 లక్షలకుపైగా తగ్గింది.