Internship | అమెరికాలోని భారత విద్యార్థుల.. ఇంటర్న్‌షిప్ కష్టాలకు చెక్!
ఇంటర్న్‌షిప్ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది.
- ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన భారత రాయబార కార్యాలయం
Internship | న్యూయార్క్: ఇంటర్న్‌షిప్ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. దీని ద్వారా అమెరికాలోని కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలతోపాటు న్యాయ, వైద్యపరమైన సమాచారాన్ని కూడా అందించనున్నది.
అమెరికాలోని ఈశాన్య రాష్ర్టాలైన కనెక్టికట్, మైనె, మాసాచుసెట్స్, న్యూహ్యాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఒహియో, పెన్సిల్వేనియా, రోడ్ ఐలండ్స్, వెర్మాంట్లలో ఈ సేవలు అందిస్తుంది. ఇంటర్న్‌షిప్ విషయంలో అర్హులైన భారతీయ విద్యార్థులను పరిగణనలోకి తీసుకునేందుకు అనేక భారతీయ, అమెరికన్ కంపెనీలు, సంస్థలు అంగీకరించినట్టు భారత కాన్సులేట్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది.
విద్యార్థులు నేరుగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పలు కంపెనీలు, బహుళజాతి సంస్థలు, టెక్నాలజీ, ప్రభుత్వ సంస్థలు, ఏవియేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, టాటాసన్స్ సహా అనేక రంగాల్లోని కంపెనీలలో విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసుకునే అవకాశాలకు సంబంధించిన జాబితాను పోర్టల్ సిద్ధం చేస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

