Indian stabbed to death | న్యూజిలాండ్‌లో కత్తితో పొడిచి భారతీయుడి హత్య
Indian stabbed to death | న్యూజిలాండ్‌లో ఒక భారతీయుడు హత్యకు గురయ్యాడు. (Indian stabbed to death) డునెడిన్‌లోని హిల్లరీ స్ట్రీట్‌లో ఇంటి ముందు ఉన్న అతడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మృతుడ్ని 28 ఏళ్ల గుర్జిత్ సింగ్‌గా గుర్తించారు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఒక భారతీయుడు హత్యకు గురయ్యాడు. (Indian stabbed to death) డునెడిన్‌లోని హిల్లరీ స్ట్రీట్‌లో ఇంటి ముందు ఉన్న అతడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మృతుడ్ని 28 ఏళ్ల గుర్జిత్ సింగ్‌గా గుర్తించారు. టెలికాం కంపెనీ కోరస్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పంజాబ్‌లోని లూధియానాకు చెందిన గుర్జిత్ సింగ్‌ను న్యూజిలాండ్‌కు పంపేందుకు అతడి తండ్రి నిషాన్ సింగ్ తన గ్రామంలోని భూమిని అమ్మాడు. అయితే ఒక్కగానొక్క కుమారుడు ఆ దేశంలో హత్యకు గురైనట్లు తెలుసుకుని హతాశుడయ్యాడు. న్యూజిలాండ్‌కు చేరుకున్న తండ్రి, కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. తమకు న్యాయం చేయాలని ఆ దేశ పోలీసులను కోరాడు.
కాగా, తన భార్య న్యూజిలాండ్‌కు రానుండటం పట్ల గుర్జిత్ సింగ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని అతడి స్నేహితులు తెలిపారు. భార్యను క్వీన్స్టౌన్ వంటి ప్రదేశాలకు తీసుకెళ్లాలని భావించిన అతడ్ని హత్య చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుర్జిత్ తండ్రికి సహాయం చేసేందుకు నిధుల సేకరణ చేపట్టారు.
మరోవైపు గుర్జిత్ సింగ్‌ను హత్య చేసిన 33 ఏళ్ల అనుమానితుడ్ని న్యూజిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు హత్య చేశాడు అన్నదానిపై వారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

