అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Indian Man Murders Wife In US | అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. అయితే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఏజెంట్లు ఆమెను అపహరించినట్లు అతడు ఆరోపించాడు. ఆ వ్యక్తే తన భార్యను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. అయితే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఏజెంట్లు ఆమెను అపహరించినట్లు అతడు ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు అబద్ధం చెప్పాడు. అయితే ఆ వ్యక్తే తన భార్యను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. (Indian Man Murders Wife In US) భారత సంతతికి చెందిన 28 ఏళ్ల గురిందర్ గిల్, 30 ఏళ్ల జాస్మిన్ గిల్ భార్యాభర్తలు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో నివసిస్తున్న ఈ దంపతులకు 8 నెలల కుమారుడు ఉన్నాడు.
కాగా, సెప్టెంబర్ 30న శాక్రమెంటోలోని నివాసంలో చివరిసారిగా జాస్మిన్ కనిపించింది. నాలుగు రోజుల తర్వాత ఆమె అదృశ్యమైనట్లు బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్త గురిందర్ గిల్‌ను పోలీసులు ప్రశ్నించారు. అయితే తన భార్య ఇంట్లో మెయిల్ చూస్తుండగా వలస నిబంధనల ఉల్లంఘనల అనుమానంతో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని తీసుకెళ్లారని పోలీసులకు అతడు చెప్పాడు.
అయితే పోలీస్ అధికారులు ఐసీఈని సంప్రదించగా గురిందర్ అబద్ధం చెప్పినట్లు తేలింది. భార్య జాస్మిన్, అతడి మధ్య విడాకులు, పిల్లల సంరక్షణ హక్కుల వివాదం కొనసాగుతున్నట్లు వారు తెలుసుకున్నారు. అక్టోబర్ 1న, ఎల్ డొరాడో కౌంటీలో కాలిన మానవ అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఆ అవశేషాలు జాస్మిన్వే అని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో భర్త గురీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిపై హత్య కేసు నమోదు చేసిన తర్వాత అక్టోబర్ 14న అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Jasmine
మరోవైపు జాస్మిన్ హత్య విషయం తెలుసుకున్న భారత్‌లోని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
ఎనిమిది నెలల పసిబిడ్డకు తల్లి అయిన ఆమె జీవితం 30 ఏళ్లకే ముగిసిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. జాస్మిన్ చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయిదని భారత్‌లో నర్సుగా పనిచేస్తున్న ఆమె తల్లి సుఖ్వీందర్ కౌర్ తెలిపారు. తన కుమార్తెను ఆమె భర్త ఎంతో క్రూరత్వానికి గురిచేసినట్లు ఒక వీడియోలో ఆమె ఆరోపించారు. జాస్మిన్ పార్థివదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ‘గోఫండ్‌మీ’ ద్వారా నిధులు సేకరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

