Meta Job | ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే భారత టెకీకి షాకిచ్చిన మెటా..!
Meta Job | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగుల కోత మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కంపెనీలోని 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంపెనీలో ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే భారత్‌కు చెందిన ఓ యువకుడు మెటాలో ఉద్యోగం కోల్పోయాడు. ఈ విషయాన్ని అతను ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
Meta Job | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగుల కోత మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కంపెనీలోని 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంపెనీలో ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే భారత్‌కు చెందిన ఓ యువకుడు మెటాలో ఉద్యోగం కోల్పోయాడు. ఈ విషయాన్ని అతను సామాజికమాధ్యమాల ద్వారా తెలియజేశాడు.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన హిమాన్ష్.. గతంలో గిట్‌హబ్, అడోబ్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశాడు. ఇటీవల మెటాలో ఉద్యోగం రావడంతో కెనడా వెళ్లి విధుల్లో చేరాడు. అయితే రెండు రోజులకే అతనికి ఊహించని షాక్ తగిలింది. సంస్థలో ఉద్యోగుల తొలగింపు ప్రభావం అతనిపై కూడా పడింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన హిమాన్ష్ లింక్డిన్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
‘మెటాలో ఉద్యోగం రావడంతో కెనడాకు షిఫ్ట్ అయ్యాను. అయితే చేరిన రెండు రోజులకే తన ప్రయాణం ముగిసింది. మెటా ఉద్యోగుల తొలగింపు ప్రభావం నాపై కూడా పడింది. ఉద్యోగం కోల్పోవడంతో ఇబ్బంది పడుతున్న వారి గురించే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా. నెక్ట్స్ ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. కెనడా, ఇండియాలో ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే నాకు తెలియజేయగలరు’ అంటూ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం హిమాన్ష్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున్నట్టు మెటా ఇటీవల ప్రకటించింది. ఆదాయంలో ఒడిదొడుకులు, పారిశ్రామిక కష్టాలను అధిగమించేందుకు ఈ చర్య చేపడుతున్నట్టు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత వారం తమ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. ఇకపై కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామని, అందులో భాగంగా కొంత కాలంపాటు ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తామని వివరించారు. తొలగించిన ఉద్యోగులకు జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. వారికి 16 వారాల ప్రాథమిక వేతనాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

