Indian-American student | భారతీయ-అమెరికన్ విద్యార్థికి ఆరుసార్లు ఆగిన గుండె.. కాపాడిన లండన్ వైద్యులు
Indian-American student | బ్రిటన్‌లోని లండన్‌లో చదివిన భారతీయ-అమెరికన్ విద్యార్థికి (Indian-American student) ఏకంగా ఆరుస్లార్లు గుండె ఆగిపోయింది. అయితే లండన్ ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు.
లండన్: బ్రిటన్‌లోని లండన్‌లో చదివిన భారతీయ-అమెరికన్ విద్యార్థికి (Indian-American student) ఏకంగా ఆరుస్లార్లు గుండె ఆగిపోయింది. అయితే లండన్ ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు. అమెరికాలోని సీటెల్‌కు చెందిన అతుల్ రావ్, ఈ ఏడాది జూలై 27న లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చదువుతున్నప్పుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అది వచ్చే వరకు సెక్యూరిటీ గార్డు సీపీఆర్ కొనసాగించాడు. వెంటనే అంబులెన్స్‌లో హామర్స్మిత్ హాస్పిటల్‌కు తరలించారు.
కాగా, అతుల్ రావ్ ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె నుంచి రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు వైద్య పరీక్షల్లో డాక్టర్లు నిర్దారించారు. పల్మనరీ ఎంబోలిజం అని పిలిచే ఈ పరిస్థితిలో అతడి గుండె ఆరు స్లార్లు ఆగినట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రి డాక్టర్లు రాత్రంగా శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు. మరుసటి రోజున సెయింట్ థామస్ హాస్పిటల్‌కు తరలించి ఎక్మోపై చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత అతడు అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం టెక్సాస్‌లోని బేలర్ యూనివర్సిటీలో ప్రీ మెడికల్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నాడు.
మరోవైపు, భారతీయ-అమెరికన్ విద్యార్థి అతుల్ రావ్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి లండన్ వెళ్లాడు. ఈ సందర్భంగా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తులు, ఆసుపత్రిని సందర్శించాడు. తల్లిదండ్రులతో కలిసి అక్కడి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. పునర్జన్మ పొందిన తాను వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత ఇతరులకు సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు అతుల్ రావ్ వెల్లడించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

