ఇండో అమెరికన్ సీఆర్రావుకు గణిత నోబెల్
ఇండో అమెరికన్ ప్రఖ్యాత గణిత, సంఖ్యా శాస్త్రవేత్త కల్యాంపూడి రాధాకృష్ణరావు (సీఆర్ రావు) మరో అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు.
న్యూయార్క్: ఇండో అమెరికన్ ప్రఖ్యాత గణిత, సంఖ్యా శాస్త్రవేత్త కల్యాంపూడి రాధాకృష్ణరావు (సీఆర్ రావు) మరో అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. గణిత నోబెల్‌గా పిలుచుకునే ‘సంఖ్యాశాస్త్రంలో 2023 అంతర్జాతీయ’ పురస్కారానికి ఆయనను ఎంపికచేసినట్టు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ప్రకటించింది.
ప్రస్తుతం సీఆర్ రావు వయస్సు 102ఏండ్లు. ఆయన గత 75 ఏండ్లుగా సంఖ్యాశాస్త్రంలో ఎంతో కృషి చేశారని, దీని ఫలితంగా వర్తక వాణిజ్యం, వైద్యం, ఆంత్రోపాలజీ, ఆర్థికశాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని ఫౌండేషన్ పేర్కొన్నది. సీఆర్ రావు ప్రస్తుతం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. 2001లో పద్మ విభూషణ్ను ఆయన అందుకున్నారు. తెలుగు కుటుంబంలో జన్మించిన రావు తన చదువును ఏపీలోని గూడూరు, నూజివీడ్, నందిగామ, విశాఖపట్నంలో పూర్తి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

