Russia | రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆర్డరిచ్చిన భారత్
భారత్‌లో వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. రష్యా నుంచి భారీగా సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనేందుకు భారత కంపెనీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ షిప్మెంట్ ఏప్రిల్ నెలలో భారత్‌కు చేరుతుంది.
ప్రపంచంలో అత్యధికంగా వంటనూనెలు దిగుమతి చేసుకునే భారత్.. కొంత కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మలేషియా, ఇండోనేషియా దేశాలు పామాయిల్, సోయా ఆయిల్ ఎగుమతులు తగ్గించేయడంతో భారత మార్కెట్లు దెబ్బతిన్నాయి. వీటికితోడు రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి వచ్చే సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు కూడా రావడం లేదు.
భారత్‌కు అత్యధికంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతి చేసే దేశాలు రష్యా, ఉక్రెయినే. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి దిగుమతులు ఆగిపోవడంతో.. రష్యా వైపు భారత్ చూస్తోందని జెమిని ఎడిబిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి చెప్పారు. ఈ కంపెనీ రష్యా నుంచి 12 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసింది.
ప్రస్తుతం టన్ను సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను 2,150 డాలర్లకు భారత్ కొనుగోలు చేస్తోంది. ఇది రికార్డు ధర. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు ఈ ధర కేవలం 1,630 డాలర్లుగానే ఉండేదని సమాచారం. గత నెల రోజులుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం కుదరలేదని, కానీ ఇప్పుడు దిగుమతులకు కూడా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ)లు లభిస్తున్న తరుణంలో మళ్లీ రష్యా నుంచి కొనుగోళ్లు ప్రారంభించారని దిగుమతి వ్యాపారులు వివరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

