Arindam bagchi | కశ్మీర్‌పై జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన భారత్
Arindam bagchi | కశ్మీర్ వివాదంపై జర్మనీ విదేశాంగ మంత్రి గత వారం బెర్లిన్‌లో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ముంబై దాడికి పాల్పడిన వారిని యూఎన్ భద్రతామండలి వెంబడిస్తున్న విషయం మరిచిపోవద్దని ఆరిందమ్ బాగ్చి జర్మనీకి సూచించారు.
Arindam bagchi | కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడంలో ఐక్యరాజ్యసమితి పాత్రను సమర్థిస్తూ జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్బాక్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని సమర్థించిన ముఖ్యంగా సరిహద్దు వివాదానికి సంబంధించిన యూఎన్ సభ్యులందరూ బాధ్యత వహించాల్సి వుంటుందని భారత్ పేర్కొన్నది. ఈ మేరకు విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి ప్రకటన విడుదల చేశారు.
జమ్ముకశ్మీర్ దశాబ్దాలుగా ఉగ్రవాదుల ఘాతుకాలను భరించిందని, ఇప్పటికీ దాడులు కొనసాగతున్నాయని ఆరిందమ్ బాగ్చి తెలిపారు. భారత్‌లోని ఇతర ప్రాంతాలలో కూడా విదేశీ పౌరులు బాధితులుగా ఉన్నారన్నారు. గత వారం బెర్లిన్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జమ్ముకాశ్మీర్‌పై పాకిస్థాన్, జర్మన్ విదేశాంగ మంత్రులు సంయుక్తంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బాగ్చి ఈ ప్రకటన విడుదల చేశారు.
26/11 ముంబైలో జరిగిన భీకర దాడులకు పాల్పడిన పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఇప్పటికీ వెంబడిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. స్వార్థం, ఉదాసీనత కారణంగా శాంతి భద్రతలను అణగతొక్కుతున్నారని, వారు తీవ్రవాద బాధితులకు కూడా న్యాయం చేయలేరని ఆరిందమ్ బాగ్చి తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

