Meta Fined: అక్రమంగా డేటా బదిలీ.. మెటా కంపెనీకి 130 కోట్ల డాలర్ల ఫైన్
Meta Fined: యురోపియన్ యూజర్ల ఫేస్బుక్ డేటాను .. అమెరికాకు ట్రాన్స్ఫర్ చేసిన కేసులో.. మెటా కంపెనీకి 130 కోట్ల డాలర్ల జరిమానా విధించారు. యురోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు ఆ ఫైన్ వేసింది.
లండన్: మెటా కంపెనీకి రికార్డు స్థాయిలో జరిమానా(Meta Fined) పడింది. యురోపియన్ యూనియన్ యూజర్లకు చెందిన ఫేస్బుక్ డేటాను.. అమెరికాలోని సర్వర్లకు అక్రమంగా బదిలీ చేసిన నేపథ్యంలో యురోపియన్ రెగ్యులేటర్లు మెటా కంపెనీకి ఫైన్ విధించారు. ఈ కేసులో 130 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. యురోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు సోమవారం ఆ జరిమానాకు చెందిన ప్రకటన విడుదల చేసింది.
ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ .. ఫేస్బుక్పై నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా ఈ ఫైన్ వేశారు. యురోప్లో ఉండే డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం ఆ జరిమానా విధించారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కలిగి ఉన్న మెటా సంస్థ.. యురోప్ వేసిన జరిమానాపై కోర్టుకు వెళ్లనున్నది. అయితే ప్రస్తుతం యురోప్లో ఫేస్బుక్ సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండదని ఆ కంపెనీ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

