న్యూఢిల్లీ : వెడ్డింగ్ డే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజు. మనసులు కలిసిన జంట మనువాడి కొత్త జీవితాన్ని ప్రారంభించే రోజు. ఇలాంటి స్పెషల్ డేను పెండ్లి కొడుకు వధువు కోసం మరింత ప్రత్యేకంగా మలిచాడు. పెండ్లి మండపంలో వధువుకు స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన వరుడు డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఆమె విద్యార్ధులను పిలిపించాడు.
The Groom gave the task of carrying rings to the Bride's students with down syndrome. How beautiful… pic.twitter.com/rVt26pRz7J
— The Figen (@TheFigen_) October 25, 2022
ముచ్చటగా ముస్తాబై వెడ్డింగ్ రింగ్స్, పూలను తీసుకురావాలని పురమాయించాడు. వివాహ వేదికలో ఒక్కసారిగా తన స్టూడెంట్స్‌ను చూసిన వధువు భావోద్వేగానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేని వధువు తన కోసం భాగస్వామి చేసిన ఏర్పాట్లకు మురిసిపోయింది.
ది ఫిజెన్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ 20 లక్షల మంది వీక్షించారు. ఈ క్లిప్‌ను చూసిన యూజర్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. కొత్త జంటకు పలువురు యూజర్లు అభినందనలు తెలిపారు. డౌన్ సిండ్రోమ్ కలిగిన వధువు విద్యార్ధులకు రింగ్స్ తీసుకువచ్చే బాధ్యతను పెండ్లి కొడుకు అప్పగించాడు అని పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు.