పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హఠాత్తుగా తన నిర్ణయానికి మార్చుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే.. ఈ నిర్ణయాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. జాతినుద్దేశించి ప్రసంగించడం లేదని పాక్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వా ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనించాల్సిన అంశం.
పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వా,ఐఎస్ఐ డీజీ ఇద్దరూ ప్రధాని ఇమ్రాన్ నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. అయితే ఏఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం ఇదమిత్థంగా తెలియడం లేదు. కొన్ని రోజుల క్రిందటే ఆర్మీ చీఫ్ బాజ్వా ప్రధాని ఇమ్రాన్‌ను రాజీనామా చేయమని తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. అవిశ్వాసం ఎదుర్కొనే ముందు, అలాగే జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించే ఓ రెండు గంటల ముందు.. ఆర్మీ చీఫ్ ప్రధాని నివాసానికి వెళ్లడం, ఆయనతో భేటీ కావడం ఆశ్చర్యకర పరిణామాలే.