Donald Trump: అదృష్టమో.. దేవుడు కాపాడాడో.. అటాక్ తర్వాత ట్రంప్ ఇంటర్వ్యూ
Donald Trump: అదృష్టం వల్లో లేక దేవుడి వల్లో తాను బ్రతికి ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. పెన్సిల్వేనియా అటాక్ తర్వాత ఆయన తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. బహుశా నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదేమో అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మిలవాకీ: అమెరికా ఎన్నికల ప్రచార సభలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)పై గన్ ఫైర్ అటాక్ జరిగిన విషయం తెలిసిందే. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని గాయపరుస్తూ వెళ్లింది. అయితే ఆ ఘటన తర్వాత ఆయన తొలిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నం గురించి చెబుతూ.. బహుశా తాను చనిపోయి ఉండేవాడినన్నారు. అదో భయానక అనుభవం అన్నారు. అదృష్టం వల్లో లేక దేవుడి వల్లో తాను బ్రతికి ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
మిలవాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ భేటీలో పాల్గొనేందుకు వెళ్లిన ట్రంప్.. అక్కడ న్యూయార్క్ పోస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బహుశా నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదేమో అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీ జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల కోసం అభ్యర్థిని రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్లోనే ప్రకటించనున్నారు.
దాడి జరిగిన సమయంలో తాను తన తలను సరైన సమయంలో.. సరైన దిశలో మళ్లించినట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. చెవిలోకి దూసుకెళ్లిన ఆ బుల్లెట్ ఈజీగా తన ప్రాణాలను తీసి ఉండేందన్నారు. బహుశా చనిపోయేవాడినని, ఇక్కడే ఉండేవాడిని కాదేమో అని పేర్కొన్నారు. ఆ దాడి సంఘటన మొత్తం నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ట్రంప్‌పై అటాక్ జరిగిన ఘటనలో ఒక ప్రేక్షకుడు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గన్‌మెన్ థామస్ క్రూక్స్‌ను సీక్రెట్ సర్వీస్ హతమార్చిన విషయం తెలిసిందే.
తనకు చికిత్సను అందించిన డాక్టర్లు స్పందించారని, ఇలాంటి ఘటనను తామెప్పుడూ చూడలేదని డాక్టర్లు పేర్కొన్నారని, ఇదో అద్భుతం అని ఓ డాక్టర్ చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇది అదృష్టమో లేక దేవుడి దయో.. కానీ చాలా మంది మాత్రం దేవుడి దయ వల్లే తాను బ్రతికి ఉన్నట్లు చెబుతున్నారన్నారు. ముఖంపై రక్తం ఉన్నా.. అటాక్ సమయంలో పిడికిలి బిగించి ఉన్న ఫోటో గురించి కామెంట్స్ వస్తున్నాయని, ఇలాంటి ఫోటోను తాము ఎప్పుడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
అవును, వాళ్లు చెప్పింది నిజమే అని, ఎందుకంటే తాను చావలేదన్నారు. అటాక్ జరిగిన తర్వాత కూడా ప్రసంగించాలనుకున్నానని, కానీ సీక్రెట్ షర్వీస్ ఏజెంట్లు తనను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తన యోగక్షేమాలు తెలుసుకునేందుకు బైడెన్ ఫోన్ చేశారని, ఆ కాల్ గురించి ట్రంప్ మెచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా బైడెన్ ఉండడాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.ఇక నుంచి తమ ఇద్దరి మధ్య పోటీ చాలా సివిల్‌గా సాగుతుందని ట్రంప్ చెప్పినట్లు రాశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

