Spider Man Record | అర్జెంటీనా వీధుల్లో స్పైడర్ మ్యాన్ల కవాతు.. వరల్డ్ రికార్డు కోసమేనా..?
Spider Man Record : సూపర్ హీరో స్పైడర్ మ్యాన్(Spider Man) సినిమా వస్తే చాలు పిల్లలు టీవీలకు అతుక్కుపోతారు. ఒళ్లుగగుర్పొడిచే స్పైడర్ మ్యాన్ సాహసాలను చూసి పెద్దవాళ్లు సైతం అలాంటిది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేలాది మంది స్పైడర్ మ్యాన్లు కంటపడితే.. ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం...
Spider Man Record : సూపర్ హీరో స్పైడర్ మ్యాన్(Spider Man) సినిమా వస్తే చాలు పిల్లలు టీవీలకు అతుక్కుపోతారు. ఒళ్లుగగుర్పొడిచే స్పైడర్ మ్యాన్ సాహసాలను చూసి పెద్దవాళ్లు సైతం అలాంటిది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేలాది మంది స్పైడర్ మ్యాన్లు కంటపడితే.. ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం. అచ్చం అర్జెంటీనాలో అలాంటి సంఘటనే జరిగింది. సుమారు వెయ్యి మందికి పైగా స్పైడర్ మ్యాన్ మాదిరిగా డ్రెస్సులు ధరించి వీధుల్లోకి వచ్చారు. దాంతో, జనమంతా చప్పట్లు కొడుతూ, గట్టిగా అరుస్తూ వాళ్లతో నడిచారు. ఇంతకు అంతమంది ఎందుకు స్పైడర్ మ్యాన్ వేషంలో కనిపించారో తెలుసా..? వరల్డ్ రికార్డు కోసం.
అవును నిజమే. అక్టోబర్ 29 ఆదివారం నాడు 1,000 మంది స్పైడర్ మ్యాన్ గెటప్‌లో అక్కడి ఒబెలిస్క్ విగ్రహం(obelisk monument) వద్ద జమయ్యారు. అర్జెంటీనా ఇన్ఫ్లుయెన్సర్ యుకీ డియానే(Uki Deane) ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఒక బహిరంగ ప్రదేశంలో వేల సంఖ్యలో స్పైడర్ మ్యాన్ వేషధారణతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేయాలనేది ఈ ప్రోగ్రాం ఉద్దేశం. ఈ ఏడాది జూన్ 3వ తేదీన మలేషియాలో 685 మంది స్పైడర్ మ్యాన్ వేషంలో ఒక్కచోట చేరి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. అక్కడి సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్(Sony Pictures Entertainment) కంపెనీ ఈ కార్యక్రమాన్ని అర్గనైజ్ చేసింది. అయితే.. రికార్డు మాట ఏమోగానీ.. మొత్తానికి అర్జెంటీనా వీధులన్ని సూపర్ హీరో వేషధారులతో సరికొత్తగా కనిపించాయి.
ఇవి కూడా చదవండి
ODI World Cup – England | ఇంగ్లండ్ జట్టులో అప్పటికీ ఇప్పటికీ అదొక్కటే తేడా!.. సారథ్యంతోనే అంతా తలకిందులు
Wasim Akram | నా కన్నా బుమ్రానే బెటర్.. యార్కర్ కింగ్‌పై వసీమ్ అక్రమ్ ప్రశంసలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

