చైనాలో సోలార్ గ్రేట్ వాల్
సౌర విద్యుదుత్పత్తి రంగంలో చైనా మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నది. 400 కిలోమీటర్ల పొడవుతో భారీ సౌర విద్యుత్తు ఫలకాలను ఏర్పాటు చేస్తున్నది.
- ఎడారిలో డ్రాగన్ భారీ సౌర విద్యుత్తు ప్రాజెక్టు
- 100 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 400 కిలోమీటర్ల పొడవైన సోలార్ ప్యానెళ్లు
బీజింగ్: సౌర విద్యుదుత్పత్తి రంగంలో చైనా మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నది. 400 కిలోమీటర్ల పొడవుతో భారీ సౌర విద్యుత్తు ఫలకాలను ఏర్పాటు చేస్తున్నది. ఇన్నర్ మంగోలియాలో ‘సీ ఆఫ్ డెత్’గా ప్రాచుర్యం పొందిన కుబుకి ఎడారిలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ‘సోలార్ గ్రేట్ వాల్’ అని పిలుస్తున్నారు. 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఐదు కిలోమీటర్ల వెడల్పు, 400 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది.
ఇప్పటికే 5.4 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి సరిపడా సౌర ఫలకాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. రాజధాని బీజింగ్కు విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో చైనా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. 2030 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానున్నది. నాసాకు చెందిన ఓఎల్ఐ, ఓఎల్ఐ-2 ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి తీసిన చిత్రాల్లో ఈ కొత్త సౌర విద్యుత్తు ప్రాజెక్టు స్పష్టంగా కనిపిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

