టైటానిక్ హీరోకి, తాలిబన్లకు లింకేంటి? ఆఫ్ఘన్ బార్బర్లు ఎందుకు వణికిపోతున్నారు?
తాలిబన్ల పేరు చెబితేనే ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు. వాళ్ల క్రూరమైన, మూర్ఖపు చట్టాలు తమను మళ్లీ బానిసలుగా మార్చేస్తాయని భయపడుతూ ఇప్పటికే లక్షల మంది దేశం వదిలి వెళ్లిపోయారు.

కాబూల్: తాలిబన్ల పేరు చెబితేనే ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు. వాళ్ల క్రూరమైన, మూర్ఖపు చట్టాలు తమను మళ్లీ బానిసలుగా మార్చేస్తాయని భయపడుతూ ఇప్పటికే లక్షల మంది దేశం వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ దేశంలోని సెలూన్ షాప్‌లలో ఉండే బార్బర్లు కూడా తాలిబన్లను చూసి భయంతో వణికిపోతున్నారు. అయితే వీళ్లు ఇలా భయపడటానికి, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియోకి ఓ లింకు ఉంది. ఆ కథేంటో ఓసారి చూద్దాం.
కొంపముంచిన లియోనార్డో హెయిర్‌కట్
ఈ స్టోరీ తెలియాలంటే 20 ఏళ్ల ముందుకు వెళ్లాలి. 1996 నుంచి 2001 వరకు తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో రాజ్యమేలిన సంగతి తెలుసు కదా. అదే సమయంలో హాలీవుడ్లో సూపర్ హిట్ మూవీ టైటానిక్ వచ్చింది. ఆ మూవీ హీరో లియోనార్డో డికాప్రియో హెయిర్‌కట్ అప్పట్లో తెగ పాపులర్ అయింది. దీనిని బీటిల్స్ కట్ అనేవాళ్లు. అతన్ని చూసి ఆఫ్ఘన్‌లోని యువత కూడా అలా హెయిర్ కట్ చేయాలంటూ అక్కడి సెలూన్లకు క్యూ కట్టారు. అయితే కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసే తాలిబన్లు ఇలాంటి పాశ్చాత్య హెయిర్‌స్టైల్స్‌ను అంగీకరించబోమని తేల్చి చెప్పారు.
అలాంటి హెయిర్‌కట్‌తో కనిపించిన యూత్‌ను పట్టుకెళ్లి గుండు చేయించేవారు. అయినా పెద్దగా ఫలితం లేకపోవడంతో నేరుగా ఇలాంటి హెయిర్‌కట్ చేసే క్షురకులకే తాలిబన్లు శిక్షలు విధించేవారు. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత ఆ తాలిబన్ల పాలన మళ్లీ రావడంతో ఇక తమ వ్యాపారాలు మూతపడినట్లే అని అక్కడి బార్బర్లు భయపడుతున్నారు.
ఇప్పటికే పని లేకుండా పోయింది. గత ఇస్లామిక్ చట్టాల ప్రకారం మా పని చట్ట విరుద్ధం. పురుషులు మేకప్, టాటూ వేసుకోవడంపై నిషేధం విధించారు. దీంతో మాకు పని లేకుండా పోయింది. ఇప్పుడింకా వాళ్లు తమ చట్టాలను పూర్తిగా అమలు చేయలేదు. అయినా మాకు పని ఉంటుందో లేదో తెలియడం లేదు అని కాబూల్‌లోని ఓ బార్బర్ మీడియాకు తన ఆవేదన చెప్పుకున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

