Moon Lander: మూన్ ల్యాండర్‌ను ప్రయోగించిన ప్రైవేటు కంపెనీ
Moon Lander: చంద్రుడి మీదకు స్పేస్‌క్రాఫ్ట్ వెళ్తోంది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దాన్ని ప్రయోగించారు. ప్రైవేటు కంపెనీకి చెందిన ఆ ల్యాండర్ ఈనెల 22వ తేదీన చంద్రుడి దక్షిణ ద్రువంపై దిగనున్నది.
ఫ్లోరిడా: అమెరికాలోని హూస్టన్‌కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ.. చంద్రుడి మీదకు ల్యాండర్(Moon Lander)ను పంపింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ కేంద్రం నుంచి ఇవాళ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా చంద్రుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపారు. ఆ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఒడిసిసెస్ పేరు పెట్టారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ద్రువంపై దిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అన్నీ సజావుగా సాగితే, తొలిసారి ఓ ప్రైవేటు కంపెనీ చంద్రుడి మీదకు ల్యాండర్ పంపిన ఘనత సాధించినట్లు అవుతుంది.
అమెరికాకు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ చండ్రుడిపైకి వెళ్లడం 51 ఏళ్ల తర్వాత తొలిసారి అవుతుంది. హూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ కంపెనీ ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారు చేసింది. నాసా ఆ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చింది. మొత్తం ఆరు రకాల శాస్త్రీయ పరికరాలను ఆ ల్యాండర్ తీసుకువెళ్తోంది. చంద్రుడి ఉపరితలంతో పాటు రేడియో తరంగాలను స్టడీ చేసేందుకు ఆ పరికరాలు ఉపయోగపడనున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

