Horse | విమానంలో అనూహ్య ఘటన.. బోనులోంచి తప్పించుకున్న గుర్రం
Horse | ఓ కార్గో విమాన (cargo plane) సిబ్బందికి షాకింగ్ అనుభవం ఎదురైంది. విమానంలో ఓ గుర్రాన్ని తరలిస్తున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉంచిన బోను నుంచి తప్పించుకున్న గుర్రం విమానంలోని సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది.
Horse | ఓ కార్గో విమాన (cargo plane) సిబ్బందికి షాకింగ్ అనుభవం ఎదురైంది. విమానంలో ఓ గుర్రాన్ని తరలిస్తున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉంచిన బోను నుంచి తప్పించుకున్న గుర్రం విమానంలోని సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది. ఎయిర్ అట్లాంటా ఐస్లాండిక్ (Air Atlanta Icelandic)కు చెందిన విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బోయింగ్ 747 కార్గో విమానం గత వారం న్యూయార్క్ (New York)లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం (John F. Kennedy International Airport) నుంచి బెల్జియం (Belgium) బయలు దేరింది. ఆ కార్గోలో ఓ గుర్రాన్ని తరలిస్తున్నారు. అయితే, విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత బోనులో నుంచి గుర్రం తప్పించుకుని విమానంలో అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టింది. గుర్రం ఒక్కసారిగా బోను నుంచి బయటకు రావడంతో సిబ్బంది హడలిపోయారు. ఆ సమయంలో విమానం భూమికి 30 వేల అడుగుల ఎత్తులో ఉంది.
ఈ విషయాన్ని వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అధికారుల అనుమతితో విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి న్యూయార్క్ విమానాశ్రయంలోనే ల్యాండ్ చేశారు. కాగా, తిరుగు ప్రయాణంలో విమానం బరువు ఎక్కువగా ఉండటంతో 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ సముద్రంలో పారబోయాల్సి వచ్చింది. అయితే, గుర్రం బోను నుంచి ఎలా తప్పించుకున్నది తెలియరాలేదు.
Also Read..
MS Dhoni | పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ధోనీ దంపతులు.. వీడియో
David Beckham | డేవిడ్ బెక్‌హమ్‌కు అంబానీ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యం.. పిక్ వైరల్
World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, ధోనీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా వాయుసేన విన్యాసాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

