కింగ్ కోబ్రా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. దీని విషం కేవలం 15-20 నిమిషాల్లోనే ఒక వ్యక్తిని చంపగలదు. 20 మందిని లేదా ఏనుగును కూడా చంపేందుకు కింగ్ కోబ్రా ఒక కాటు సరిపోతుంది. భారతదేశంలో, ఇతర దక్షిణాసియా దేశాల్లో ఈ పాములు సాధారణంగా కనిపిస్తాయి. అందుకే వీటిని చూసి చిన్న చిన్న జంతువులు భయపడతాయి. కానీ, ఓ కోడి తన పిల్లలను రక్షించుకునేందుకు కింగ్ కోబ్రాతో పోరాడింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘వైల్డ్ కోబ్రా’ అనే యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేశారు. పిల్లలతో కలిసి ఓ కోడి గూటిలో ఉండగా, అందులోకి కింగ్ కోబ్రా ఎంటర్ అయ్యింది. దీంతో ఆ తల్లికోడి తన పిల్లలను దూరంగా నెట్టేసి, కోబ్రాతో తలపడింది. పిల్లలవైపు రాకుండా రక్షణగా నిలిచింది. తన ముక్కుతో పాముపై పొడుస్తూనే ఉంది. చివరికి కింగ్‌కోబ్రా తోకముడిచింది. ఈ వీడియో యూట్యూబ్‌లో 30 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది.